ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హైదరాబాద్​లో భారీ వర్షం.. విమానాల రాకపోకలకు అంతరాయం

By

Published : Apr 21, 2022, 8:20 PM IST

Heavy Rain in Hyderabad: ఉక్కపోతతో ఉడికిపోతున్న భాగ్యనగర నగరవాసులకు వరుణుడు మళ్లీ ఊరటనిచ్చాడు. నగరంలో పలుప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బలమైన ఈదురుగాలులకు కొన్నిప్రాంతాల్లో చెట్లు నేలమట్టమయ్యాయి. భారీవర్షాలతో శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Rain in Hyderabad
Rain in Hyderabad

Rain in Hyderabad: హైదరాబాద్​ నగరంలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులలో కూడిన వాన రావడంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కూకట్​పల్లి, మేడ్చల్, బాలానగర్, ఎంజె మార్కెట్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, బేగం బజార్ పరిసర ప్రాంతాల్లో వాన కురిసింది. భారీగా ఈదురుగాలులు వీయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాతబస్తీలోని మలక్‌పేట్ ప్రాంతంలో భారీవృక్షం నేలమట్టమైంది. బలమైన ఈదురుగాలులకు తీగలగూడలో చెట్టు కూలిపోవడంతో ద్విచక్రవాహనం ధ్వంసమైంది. శంషాబాద్​లో కురిసిన భారీవర్షం విమానాల రాకపోకలపై ప్రభావం చూపింది. హైదరాబాద్ రావల్సిన 4 విమానాలను వాతావరణం సరిగా లేదని అధికారులు వెనక్కి పంపారు.

ధ్వంసమైన ద్విచక్రవాహనం

మలక్‌పేట్, మూసారాంబాగ్, చాదర్‌ఘాట్, కోఠి, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, కొత్తపేట, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, కొండాపూర్‌, మియాపూర్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. వేగంగా వీసిన ఈదురుగాలులకు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ భవనంపై ఉన్న భారీ హోర్డింగ్ పక్కకు ఒరిగింది. మరోచోట పాత భవనం కూలిపోవడంతో ఓ వృద్ధరాలికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు తెలంగాణలో రాగల మూడ్రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

భవనంపై పక్కకు ఒరిగిన భారీ హోర్డింగ్

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details