ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM

By

Published : Sep 11, 2022, 6:59 PM IST

ఏపీ ప్రధాన వార్తలు

TOP NEWS 7 PM
ఏపీ ప్రధాన వార్తలు

  • Janasena: రాజు మారినప్పుడల్లా.. రాజధాని మారదు: నాదెండ్ల మనోహర్​
    Nadendala Manohar on farmers padayatra: రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని జనసేన నేత నాదెండ్ల మనోహర్​ అన్నారు. ఒక రాజధానినే కట్టలేని జగన్..​ మూడు రాజధానులను ఎలా కడతారని ప్రశ్నించారు. రాజధాని రైతుల పాదయాత్రకు జనసేన మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Brother killed younger brother: తమ్ముడిని చంపిన అన్న... కారణం అదేనా..!
    Brother killed younger brother: తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. సొంత తమ్ముడిని అన్న దారుణంగా హత్య చేశాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. అసలేం జరిగందంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Krishna river: కృష్ణానదికి వరద పోటు.. జలదిగ్బంధంలో కృష్ణలంక, తారకరామనగర్
    Krishna river: కృష్ణా నదికి వరద పోటెత్తడంతో.. కృష్ణలంక, తారకరామనగర్ ప్రాంతాలను నీరు చుట్టుముట్టింది. వరద నీరు రాకుండా కోట్ల రూపాయలు వెచ్చించి రక్షణ గోడ నిర్మించినా తమకు ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో కట్టుబట్టలతో కట్ట మీదకు వచ్చామని చెబుతున్నారు. తారకరామనగర్ ప్రాంత వాసుల వరద కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Double Murder: నెల్లూరులో కలకలం.. ఇద్దరు దారుణహత్య
    Double murder in Nellore: నెల్లూరు జిల్లాలో వరుసగా జరుగుతున్న హత్యలు నగర ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నాయి. దంపతుల జంట హత్య మరవకముందే మరో దారుణం జరిగింది. టైలర్స్​ కాలనీలో ఇద్దరు వ్యక్తులను ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బహిర్భూమికి వెళ్లిన బాలికను ఎత్తుకెళ్లి గ్యాంగ్​ రేప్​.. స్నేహం చేయకుంటే కిడ్నాప్​!
    15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరి జిల్లాలో జరిగింది. ఝార్ఖండ్​లో జరిగిన మరో ఘటనలో తమతో స్నేహం చేయాలని లేకపోతే కిడ్నాప్​ చేస్తామని వేధించారు ఆకతాయిలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ద్వారకాపీఠ్​ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూత
    ద్వారకాపీఠ్​ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి పరమపదించారు. 99 ఏళ్ల వయసులో ఆయన మధ్యప్రదేశ్​ నార్సింగ్​పుర్​లోని పీఠంలో తుది శ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వీరప్పన్​ను గడగడలాడించిన ధీశాలి.. జనం గుండెల్లో సజీవం..
    నిజాయతీగా పనిచేసే ఏ అధికారైనా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారనే దానికి నిలువెత్తు నిదర్శనం ఐఎఫ్‌ఎస్‌ అధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్‌. వీరప్పన్‌ను వీరోచితంగా బంధించి బెంగళూరుకు తరలించారు. కొన్నాళ్లకు వీరప్పన్ తప్పించుకున్నాడు. వీరప్పన్ పిలుపు మేరకు ఒంటరిగా వెళ్లిన శ్రీనివాస్​ను వీరప్పన్ కాల్చి చంపాడు. ఆదివారం.. వీరప్పన్ స్వగ్రామమైన గోపీనాథంలో శ్రీనివాసన్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కోహ్లీపై దాదా ఇంట్రెస్టింగ్ కామెంట్స్​.. ఏమన్నాడంటే?
    టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​, డాషింగ్ బ్యాటర్​ కోహ్లీ గురించి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీకి తనకంటే ఎక్కువ ఆడగలిగే సత్తా ఉందని అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో విషాదం
    ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి సరస్వతి(88) అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Food: రోజూ తినేవే... కానీ ఇంకాస్త కొత్తగా..!
    New recipes: తినడానికి ఎన్ని రకాలున్నా... ఇంకేదో కొత్తది కావాలనిపిస్తుంది. అందుకే స్టార్‌ షెఫ్‌లు దేశవిదేశీ వంటకాలను కలగలిపి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అలా చేసినవన్నీ అందరికీ నచ్చకపోవచ్చుగాక. కానీ వాటిల్లో కొన్ని రుచులు మాత్రం ఎక్కువమందిని ఆకట్టుకుని రెస్టరెంట్ల మెనూలోకీ వంటింట్లోకీ వస్తుంటాయి. ఇవన్నీ అలా వచ్చినవే..! పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details