ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 AM

By

Published : Jun 26, 2022, 6:59 AM IST

.

TOP NEWS
ప్రధాన వార్తలు

  • నేడే ఆత్మకూరు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఉదయం 8 గంటలకు ప్రారంభం
    Atmakur By Election Counting Today: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక ఓట్లు లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి హరీంధిర ప్రసాద్‌ తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌ లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ప్రభుత్వ షాపుల్లో విక్రయించే మద్యంలో విషం!
    రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న 3 రకాల బ్రాండ్లలో విషపూరిత, హానికరమైన రసాయనాలు ఉన్నట్లు తెదేపా వెల్లడించింది. ఆంధ్రాగోల్డ్‌, 9 సీహార్స్‌, సిల్వర్‌ స్ట్రైప్స్స్‌ విస్కీ నమూనాల్ని పరీక్షిస్తే వెల్లడైనట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రాజధాని భూముల అమ్మకం.. 15 ఎకరాల విక్రయానికి అనుమతి
    అమరావతి పనుల కోసం 15 ఎకరాలను విక్రయించేందుకు సీఆర్‌డీఏకి అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం. ఈ మేరకు 6వ తేదీన ఇచ్చిన జీవో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దశలవారీగా 500 ఎకరాలను విక్రయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'కాపు నేస్తం'లో 41వేల పేర్లు గల్లంతు.. లబ్ధిదారుల్లో ఆందోళన
    45-60 ఏళ్లలోపు మహిళలకు ఏటా రూ.15 వేలు సాయం అందించే కాపు నేస్తం పథకం లబ్ధిదారుల జాబితాలో 41 వేల పేర్లు గల్లంతయ్యాయి. నిరుడు 3.27 లక్షల మందికి సాయం అందగా.. ఈ దఫా 2.85 లక్షల మంది జాబితానే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అమరావతి నిర్వీర్యానికే చీకటి జీవోలు: రాజధాని రైతులు
    అమరావతి భూములను విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించటంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణాలను చేపట్టకుండా భూములు విక్రయించేందుకు చీకటి జీవోను జారీచేసిందని మండిపడ్డారు. అమరావతిని నిర్వీర్యం చేయడానికే ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆ డ్రగ్​ ఇన్​స్పెక్టర్​ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు.. అధికారులే షాక్​!
    బిహార్‌లోని పట్నాలో విజిలెన్స్‌ అధికారులు జరిపిన దాడుల్లో రూ.3 కోట్ల అక్రమ నగదు బయటపడింది. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ జితేందర్‌ కుమార్‌ ఇల్లు, కార్యాలయాలపై శనివారం ఏక కాలంలో దాడి చేసిన విజిలెన్స్‌ అధికారులు.. నగదుతో పాటు, కిలో బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'ఫ్రీ ఫైర్​'లో బాలికతో పరిచయం.. ఖతర్ నుంచి వచ్చి కిడ్నాప్.. నేపాల్​కు తీసుకెళ్తుండగా..
    Qatar man kidnaps minor: ఆన్​లైన్ గేమ్​లో బాలికతో పరిచయం పెంచుకున్న ఓ ఖతర్ వాసి.. ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. బాలికను బ్లాక్​మెయిల్ చేసి అపహరించుకుపోయాడు. నేపాల్​కు వెళ్లేందుకు ప్లాన్ వేసుకోగా.. మధ్యలోనే పోలీసులు వారిని అడ్డగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అమెరికాలో తుపాకీ సంస్కృతికి చెక్‌.. ఆ చట్టంపై బైడెన్​ సంతకం
    Gun violence bill: ఎప్పుడెప్పుడా అని అమెరికన్లు ఎదురుచూస్తున్న తుపాకుల నియంత్రణ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. తుపాకీ నియంత్రణ చట్టంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ సంతకం చేశారు. ఈ చట్టంతో ప్రాణాలు రక్షిస్తామని.. శ్వేతసౌధంలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • టీమ్​ ఇండియాకు షాక్​.. కెప్టెన్​ రోహిత్​ శర్మకు కరోనా
    ఇంగ్లాండ్​తో ఐదో టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్న భారత జట్టుకు భారీ షాక్​ తగిలింది. టీమ్​ ఇండియా సారథి రోహిత్​ శర్మకు కరోనా పాజిటివ్​గా తేలినట్లు బీసీసీఐ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రణ్​బీర్​ మొదటి భార్య ఆలియా కాదట.. ఆమె కోసం ఇంకా ఎదురుచూపులు!
    Aliabhatt Ranbirkapoor: ఇటీవలే వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్​ కపూర్​ ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​ చేశారు. ఆలియా భట్​ తన మొదటి భార్య కాదని, తొలి భార్య కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details