ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM

By

Published : Jun 25, 2022, 8:58 AM IST

.

TOP NEWS
ప్రధాన వార్తలు

  • తెలుగు వాడిగా ఉండటాన్ని గర్విస్తున్నా: జస్టిస్ ఎన్వీ రమణ
    CJI Justice NV Ramana: అమెరికా పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ.. ఇవాళ న్యూజెర్సీలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను తెలుగు ప్రజల్లో ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నట్లు.. ఈ సందర్భంగా పేర్కొన్నారు. పుట్టిన ఊరు, మట్టి వాసన గుబాళింపును నెమరువేసుకోవాలని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అంబేడ్కర్‌ కోనసీమకు ఆమోదం.. జులైలో మరో 4 పథకాలు!
    అంబేడ్కర్​ కోనసీమ జిల్లాగా పేరు మార్పు నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే.. ఆక్వా రైతుల విద్యుత్తు రాయితీ పదెకరాలకు పెంపు.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ.. సంక్షేమ క్యాలెండర్‌ ద్వారా జులైలో 4 పథకాలు అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • గ్రూప్‌-1 ఎంపిక ప్రక్రియ యథాతథం
    గ్రూప్‌-1 ఎంపిక ప్రక్రియను యథాతథంగా కొనసాగించుకోవచ్చని ఏపీపీఎస్సీకి హైకోర్టు అనుమతిచ్చింది. అయితే నియామకాలు సింగిల్‌ జడ్జి తీర్పునకు లోబడి ఉంటాయని తేల్చిచెప్పింది. ఫలితాల ప్రకటన, పోస్టింగు ఉత్తర్వులు ఇస్తే.. అవి సింగిల్‌ జడ్జి తీర్పునకు లోబడి ఉంటాయనే విషయాన్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించాలంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • దగదర్తి నుంచి విమానాలు ఎగిరేదెప్పుడు?
    నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో గుత్తేదారు సంస్థతో కుదిరిన ఒప్పందాన్ని వైకాపా ప్రభుత్వం రద్దు చేసి సుమారు మూడేళ్లు పూర్తవుతోంది. కొత్త సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) ఇప్పటికీ సిద్ధం కాలేదు. భూ వివాదాలు పరిష్కారానికి నోచుకోవటం లేదు. దీంతో దగదర్తి నుంచి విమానాలు ఎగిరేదెప్పుడని పలువురు ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'మహా' రాజకీయ సంక్షోభంలో సయోధ్యకు దారేది?
    మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. సొంత పార్టీపై తిరుగుబావుట ఎగరవేసిన ఏక్​నాథ్​ శిందే.. అసలైన శివసేన తమదేనని పేర్కొన్నారు. మరోవైపు.. మహా వికాస్​ అఘాడీని వీడాలన్న అసమ్మతి ఎమ్మెల్యేల డిమాండ్​ను తోసిపుచ్చారు సీఎం ఉద్ధవ్​ ఠాక్రే. పార్టీని పునఃనిర్మించుకుంటామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • భార్యకు ప్రేమతో.. చంద్రుడిపై స్థలాన్ని కానుకగా ఇచ్చిన భర్త
    Man gifts land on moon to wife: సాధారణంగా ఎవరైనా పుట్టినరోజు కానుకగా ఆభరణాలు ఇస్తారు.. వస్తువులు ఇస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చారు. అందులో వింత ఏముంది అనుకుంటున్నారా? ఆ స్థలం కొన్నది భూమిపై కాదండి చంద్రమండలంపైన! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అఫ్గాన్‌లో 1,150కి చేరిన మృతుల సంఖ్య.. మరోసారి కంపించిన భూమి
    Afghanisthan Earth Quake Deaths: అఫ్గానిస్థాన్​లో సంభవించిన భూకంపం పెనువిషాదాన్ని నింపింది. బుధవారం నెలకొన్న ఈ ఘోర విపత్తులో మృతుల సంఖ్య 1,150కి పెరిగింది. భూకంపం కారణంగా సుమారు 3,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అక్కడ ప్రజలు నిలువ నీడలేని స్థితిలో దుర్భర జీవనం సాగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • కార్డు 'టోకనైజేషన్' డెడ్‌లైన్ పొడిగింపు.. ఎప్పటివరకు అంటే?
    Card Tokenization: డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల‌పై ఆన్‌లైన్ లావాదేవీల‌కు 'టోకనైజేష‌న్' విధానం అమ‌లు గ‌డువును మూడు నెల‌లు పొడిగిస్తున్నట్లు ఆర్​బీఐ ప్రకటించింది. తొలుత నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం జులై ఒక‌టో తేదీ నుంచి టోకనైజేష‌న్ విధానం అమ‌ల్లోకి రావాల్సి ఉంది. కానీ.. కొన్ని భాగ‌స్వామ్య ప‌క్షాల ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని సెప్టెంబ‌ర్ 30 వర‌కు ఆర్​బీఐ వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్లో సురేఖ జోడీ
    Archery World Cup 2022: ఆర్చరీ ప్రపంచకప్‌లో తన హవా కొనసాగిస్తోంది తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖ. స్టేజ్‌-3 టోర్నీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ- జ్యోతి సురేఖ జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • సూర్య సమర్పణలో సాయి పల్లవి.. అలా బతకొద్దంటున్న అనసూయ!
    కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. సాయి పల్లవి నటిస్తున్న ఓ చిత్రానికి స్టార్ హీరో సూర్య సమర్పకులుగా వ్యవహరించనున్నారు. ఇక బాలీవుడ్ సూపర్​స్టార్ షారుక్​ ఖాన్​తో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details