ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS: ప్రధాన వార్తలు@3PM

By

Published : May 10, 2022, 2:57 PM IST

TOP NEWS
ప్రధాన వార్తలు ()

TOP NEWS: ప్రధాన వార్తలు@3PM

  • మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు
    రాజధాని మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు డిజైన్‌లో అక్రమాలపై మంగళగిరి సీఐడీకి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు చేశారు. లింగమనేని రమేష్‌, లింగమనేని వెంకట సూర్యరాజశేఖర్‌, ఎల్‌ఈపీఎల్‌ ప్రాజెక్ట్స్‌, రామకృష్ణ హౌసింగ్‌ ప్రై. లిమిటెడ్‌ డైరెక్టర్‌ అంజనీకుమార్‌పైనా మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • TDP on Narayana Arrest: నారాయణ అరెస్టుపై తెదేపా నేతల ఆగ్రహం
    TDP leaders on Narayana arrest: మాజీ మంత్రి నారాయణ అరెస్టుపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షపూరిత రాజకీయాలకు ఇప్పటికైనా వైకాపా స్వస్తి పలకాలని తెదేపా నేతలు సోమిరెడ్డి అన్నారు. నారాయణ విద్యాసంస్థల్లో ఎవరైనా తప్పు చేస్తే ఛైర్మన్‌ను అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. విద్యా శాఖలో లీకేజీపై విద్యాశాఖ మంత్రిని అరెస్టు చేయాలని సోమిరెడ్డి డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సీబీఐ అధికారులకు బెదిరింపులు... పోలీసులకు ఫిర్యాదు
    Threats to CBI officers: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ చేస్తున్న సీబీఐ అధికారులకు కడపలో బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో వారు చిన్న చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Tulasi Reddy: పొత్తులపై పవన్​కు స్థిరత్వం, చిత్తశుద్ధి లేదు: తులసిరెడ్డి
    Tulasi Reddy: పొత్తులపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. రాష్ట్రానికి మొదటి ద్రోహి భాజపా అని, రెండవ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • RAINS: ఉద్యానవన పంటల్ని దెబ్బతీసిన "అసని" తుపాను
    RAINS: రాష్ట్రంలో అసని తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. తుపాన్ ప్రభావంతో అన్నమయ్య జిల్లాలో ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. జిల్లాలో విస్తారంగా ఉన్న మామిడి తోటలపై గాలులు తీవ్ర ప్రభావం చూపాయి. రాయచోటి, రామాపురం, లక్కిరెడ్డిపల్లి, గాలివీడు, తదితర మండలాల్లో.. అత్యధిక నష్టం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దిల్లీలో మళ్లీ 'ఆపరేషన్ బుల్డోజర్'.. అడ్డుకున్న ఎమ్మెల్యే అరెస్ట్
    Delhi Encroachment Drive: దిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతూనే ఉంది. షాహీన్​బాగ్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల సోమవారం వెనక్కితగ్గిన అధికారులు.. దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో తిరిగి కూల్చివేతలను ప్రారంభించారు. అడ్డుకోబోయిన స్థానిక ఎమ్మెల్యేను అరెస్ట్​ చేశారు పోలీసులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బైక్​కు దారి ఇవ్వలేదని.. కర్రలతో కొట్టి బస్సు డ్రైవర్​ దారుణ హత్య
    Pune Youth Murder: ద్విచక్రవాహనానికి దారి ఇవ్వలేదని ఓ వ్యక్తిని కొట్టిచంపారు దుండగులు. మహారాష్ట్ర పుణెలోని ఆంద్​గావ్​లో జరిగిందీ ఘటన. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టైట్​ జీన్స్​, జుట్టుకు రంగులు వేస్తే అంతే! చుక్కలు చూపిస్తున్న కిమ్!!
    North Korea Rules: విదేశీ సంస్కృతి అరికట్టేలా కఠిన నిబంధనల్ని అమలు చేస్తోంది ఉత్తరకొరియా. 30 ఏళ్లలోపు మహిళల్ని లక్ష్యంగా చేసుకుని టైట్​ జీన్స్​, జుట్టుకు రంగులు వేయడం, అసభ్యకర రాతల బట్టలు ధరించడం వంటి వాటిని కఠినంగా అణచివేస్తోంది. మరోవైపు ఉత్తరకొరియా అణు నిరాయుధీకర చర్యలు ప్రారంభిస్తే.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానన్నారు దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు యున్ సుక్ యోల్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Uber cup: పీవీ సింధు జోరు.. క్వార్టర్స్​లో భారత్​
    Uber cup 2022 PV Sindhu: ఉబెర్​ కప్​ 2022లో భారత్​ 4-1తేడాతో యూఎస్​ఏను ఓడించి క్వార్టర్​ ఫైనల్స్​లో అడుగుపెట్టింది. పీవీ సింధు 21-10, 21-11 తేడాతో గెలవగా.. మిగతా భారత ప్లేయర్లు కూడా మంచి ప్రదర్శన చేసి టోర్నీలో మరో అడుగు ముందుకేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'గాడ్​ఫాదర్'​ రిలీజ్ డేట్​.. ఫస్ట్​లుక్​తో అల్లరి నరేశ్​​.. 'ది ఘోస్ట్'​ కొత్త షెడ్యూల్
    కొత్త సినిమాలకు సంబంధించిన కొన్ని అప్డేట్స్​ సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో చిరంజీవి 'గాడ్​ఫాదర్'​ రిలీజ్ డేట్​, నాగార్జున 'ది ఘోస్ట్'​ కొత్త షెడ్యూల్​, అల్లరినరేశ్​ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఫస్ట్​లుక్​ పోస్టర్​ వివరాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details