ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బంగాళాఖాతంలో అల్పపీడనం... రాగల మూడు రోజులు వర్షాలు

By

Published : Mar 18, 2022, 3:50 PM IST

Updated : Mar 18, 2022, 5:26 PM IST

AP Weather Report: అండమాన్ తీరం వద్ద ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం... క్రమంగా బలపడి బంగ్లాదేశ్, మయన్మార్ వైపు కదులుతోంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో కోస్తాంధ్ర, ఒడిశా తీరంలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

AP Weather Report
AP Weather Report

AP Weather Report: అండమాన్ తీరం వద్ద ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. క్రమంగా మరింత బలపడి బంగ్లాదేశ్, మయన్మార్ వైపు కదులుతోంది. రేపటిలోగా పూర్తి అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో కోస్తాంధ్ర, ఒడిశా తీరంలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

తక్కువ ఎత్తులో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తుండటంతో.. యానాం, దక్షిణ కోస్తాంధ్రల్లో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలోనూ ఈవాళ, రేపు పొడి వాతావరణం ఉండగా.. ఎల్లుండి తేలికపాటి వర్షం ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది.

ఇదీ చదవండి:సహకరిస్తే సరి.. లేకపోతే అంతే.. "ఆమెను" బెదిరించిన వైకాపా నేత కుమారుడు..!

Last Updated :Mar 18, 2022, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details