ఆంధ్రప్రదేశ్

andhra pradesh

RAINS: తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు

By

Published : Aug 16, 2021, 7:25 AM IST

నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలోని తూర్పు, ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రదేశాల్లో ఈ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో నేడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

తెలంగాణలో నేడు,రేపు అతిభారీ వర్షాలు
తెలంగాణలో నేడు,రేపు అతిభారీ వర్షాలు

బంగాళాఖాతం ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు కొన్నిచోట్ల వర్షాలు కురిశాయి. ఆదివారం రాత్రి నుంచి హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది.

అత్యధికంగా పెంట్లం(భద్రాద్రి జిల్లా)లో 6.5, పెదవీడు(సూర్యాపేట)లో 3.3, పమ్మి(ఖమ్మం జిల్లా)లో 3.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత 20 రోజులుగా వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదముందని రైతులుఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాతావరణం చల్లబడి వర్షాలు కురవడంతో పంటలకు కొంత మేలు జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు.

శనివారం ఛత్తీస్​గఢ్​ దాని పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణా వరకు వ్యాపించి ఉన్న ఉత్తర - దక్షిణ ఉపరితల ద్రోణి ఆదివారం రోజున బలహీన పడిందని అధికారులు పేర్కొన్నారు. ఆదివారం ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాాఖాతంలోని దక్షిణ ఒడిశా తీరంలో సముద్ర మట్టానికి 3.1 కి.మీ. నుంచి 7.6 కి.మీ. ఎత్తు మధ్య కొనసాగుతూ నైరుతి దిశ వైపు వంపు తిరిగి ఉందని ఐఎండీ అధికారులు వివరించారు.

ఇదీ చూడండి:నేడు రాష్ట్రానికి లోక్‌సభ స్పీకర్‌ ఓంప్రకాశ్‌ బిర్లా

ABOUT THE AUTHOR

...view details