ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నీటిపై తేలే సౌర కేంద్రం 30న జాతికి అంకితం

By

Published : Jul 25, 2022, 11:19 AM IST

Floating Solar Plant : తెలంగాణలోని రామగుండంలో ఎన్టీపీసీ జలాశయంపై నిర్మించిన నీటిపై తెేలియాడే సౌర విద్యుత్తు కేంద్రాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు ఈ నెల 30న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌ విధానంలో ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ఎన్టీపీసీ యాజమాన్యానికి సమాచారం అందింది.

నీటిపై తేలే సౌర కేంద్రం
నీటిపై తేలే సౌర కేంద్రం

Floating Solar Plant : తెలంగాణలోని ఎన్టీపీసీ జలాశయంపై నిర్మించిన 100 మెగావాట్ల నీటిపై తేలియాడే సౌర విద్యుత్తు కేంద్రాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు ఈ నెల 30న ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌ విధానంలో ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ఎన్టీపీసీ యాజమాన్యానికి సమాచారం అందింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో రూ.423 కోట్లతో ఎన్టీపీసీ జలాశయంలోని 500 ఎకరాల విస్తీర్ణంలో 100 మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రాన్ని రెండేళ్ల వ్యవధిలో నిర్మించారు.

జులై 1న పూర్తిస్థాయి విద్యుత్తు ఉత్పత్తి దశలోకి తీసుకొచ్చారు. 40 బ్లాకుల్లో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఒక్కో బ్లాక్‌లో 2.5 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోంది. కేరళలోని కాయంకుళంలో 92.5 మెగావాట్ల సౌర కేంద్రాన్ని, రామగుండం ప్రాజెక్టును దేశ ప్రధాని జాతికి అంకితమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలోనే మరో మూడు కొత్త విద్యుత్తు ప్రాజెక్టులకు ప్రధాని భూమి పూజను వర్చువల్‌ పద్ధతిలోనే చేయనున్నారు. దేశంలోని 100 మెగావాట్ల అతి పెద్ద ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న సందర్భంగా ఎన్టీపీసీ ఉన్నతాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details