ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Rangam in Lashkar Bonalu: 'భక్తులారా కష్టాలు తప్పవు.. అధైర్యపడకండి.. ఆదుకుంటా!'

By

Published : Jul 26, 2021, 12:14 PM IST

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవంలో రంగం కార్యక్రమం ముగిసింది. ఇందులో స్వర్ణలత.. అమ్మవారి భవిష్యవాణి వినిపించారు. కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్నా.. తనను నమ్మి పూజలు చేయడం పట్ల అమ్మ సంతోషం వ్యక్తం చేశారు. తన భక్తులకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటానని మాట ఇచ్చారు.

rangam-program
rangam-program

Lashkar Bonalu : 'ఆపదలో నా భక్తుల వెంటే ఉంటాను'

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవంలో కీలక ఘట్టం ముగిసింది. రంగం కార్యక్రమంలో భాగంగా స్వర్ణలత.. అమ్మవారి మాటగా భవిష్యవాణి వినిపించారు. పూజల పట్ల ఏ మాత్రం సంతోషంగా లేనని గతేడాది రంగం కార్యక్రమంలో చెప్పిన అమ్మవారు.. ఈ ఏడు మాత్రం భక్తుల పూజల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మహమ్మారి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టిందని అన్నారు. పూజలు సంతోషంగా అందుకున్నట్లు తెలిపారు. భక్తులు, ప్రజలను సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత తనదేనని అన్నారు.

" మహమ్మారితో ఎన్ని ఇబ్బందులు పడ్డా నీకు పూజలు చేశాం తల్లీ. నిన్ను కొలిస్తే.. మా బాధలు తొలగుతాయని నమ్మాం. నీ ఆశీర్వాదంతో మేము సుఖ సంతోషాలతో ఉంటాం. సకాలంలో వానలు, చక్కటి ఎండలతో పంటలు సమృద్ధిగా పండాలని ఆశీర్వదించు తల్లీ"

- పూజారి

"ఈ ఏడాది వర్షాల వల్ల రైతులు, భాగ్యనగర ప్రజలు కొంత ఇబ్బందులు పడతారు. కానీ.. నన్ను నమ్ముకోండి. మీ కష్టాలను నేను అడ్డుకుంటాను. అమ్మకు ఇన్ని పూజలు చేసినా.. ఏం ఒరగలేదని అనుకోకుండి. ఎంత పెద్ద ఆపద వచ్చినా మీ వెంటే ఉండి కాపాడతాను. నా భక్తులంతా ఆనందంగా ఉండేలా చూసే బాధ్యత నాది"

- రంగంలో భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత

ఇదీ చదవండి:

Floods Effect on Devipatnam: జలదిగ్బంధంలో దేవీపట్నం.. ప్రభుత్వ తీరుపై పోలవరం నిర్వాసితుల ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details