ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీశైలం, సాగర్​కు భారీగా వరద.. దిగువకు నీటి విడుదల

By

Published : Oct 13, 2019, 11:40 AM IST

Updated : Oct 13, 2019, 1:43 PM IST

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు మరోసారి జలకళ వచ్చింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల దాటికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలంలో 4 గేట్లు, నాగార్జునసాగర్​లో 6 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు.

once agian continuing flood to Srisailam and Sagar projects

శ్రీశైలం, సాగర్​కు కొనసాగుతున్న వరద..గేట్లు ఎత్తివేత

శ్రీశైలం మళ్లీ నిండింది. నాగార్జున సాగర్ మరోసారి పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు.. రెండు ప్రాజెక్టుల్లో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరింది. జురాల ప్రాజెక్టులో ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్న కారణంగా.. శ్రీశైలానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 4 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్ ​ఫ్లో 1.26 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఔట్​ ఫ్లో 1.80 లక్షలక్యూసెక్కులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. జలాశయంలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ఈ సీజన్​లో ఆరోసారి గేట్లు ఎత్తారు.

సాగర్​లోనూ జలకళ

శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్​కు నీటి ప్రహహాం భారీగా కొనసాగుతోంది. సాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు ఉండగా..ప్రస్తుతం గరిష్ఠస్థాయికి చేరుకుంది. 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు 1.42 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఇదీ చదవండి:

తిరుమలలో 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు

Intro:Body:Conclusion:
Last Updated : Oct 13, 2019, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details