ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'బుల్లెట్టు బండి' పాటకు డ్యాన్స్‌ వేసిన మంత్రి నారాయణస్వామి సతీమణి

By

Published : Sep 16, 2021, 11:50 AM IST

Updated : Sep 16, 2021, 11:57 AM IST

బుల్లెట్టు బండి పాటకు మంత్రి నారాయణస్వామి సతీమణి డ్యాన్స్‌ వేశారు. బుధవారం మంత్రి నారాయణ స్వామి 42వ వివాహ వార్షికోత్సవం వేడుకల్లో ఇలా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు.

DCM WIFE  DANCE
DCM WIFE DANCE

బుల్లెట్టు బండి పాటకు డ్యాన్స్‌ వేసిన మంత్రి నారాయణస్వామి సతీమణి

బుల్లెట్టు బండి.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే పాట మారుమోగుతోంది. ఏ వేడుకలోనైనా ఈ పాట ఉండాల్సిందే.. చిన్నా పెద్దా అందరూ.. చిందులేయాల్సిందే. హుషారెత్తించే ఈ పాటకు తాజాగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సతీమణి.. డాన్స్‌ వేశారు. మంత్రి నారాయణ స్వామి 42వ వివాహ వార్షికోత్సవాన్ని తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సతీమణి బుల్లెట్టు బండి పాటకు నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారు. మంత్రి సతీమణి డ్యాన్స్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఇదీ చదవండి: దేశంలో మళ్లీ పెరిగిన కేసులు- కొత్తగా 30వేల మందికి వైరస్​

Last Updated : Sep 16, 2021, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details