ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'తెలంగాణ విద్యార్థులను భారత్‌కు రప్పించండి.. ఖర్చులు మేమే భరిస్తాం'

By

Published : Feb 25, 2022, 4:50 PM IST

KTR Tweet To Union Minister JaiShankar : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల గోడును విదేశాంగ మంత్రి జైశంకర్‌ దృష్టికి తీసుకువెళ్లారు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. వారిని స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని.. దానికయ్యే ఖర్చంతా రాష్ట్ర సర్కారే భరిస్తుందని హామీ ఇచ్చారు.

KTR Tweet To Union Minister JaiShankar
కేంద్ర మంత్రికి కేటీఆర్​ ట్విట్​

KTR Tweet To External Affairs Minister : ఉక్రెయిన్​లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విద్యార్థులను క్షేమంగా తీసుకొచ్చేందుకు మాత్రం త్వరగా కేంద్రం చర్యలు తీసుకోవాలని ట్విటర్ ద్వారా రిక్వెస్ట్ చేశారు.

తెలంగాణ సర్కార్ చర్యలు..
మరోవైపు.. ఉక్రెయిన్‌లోని తెలుగువారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. ఉక్రెయిన్​లో చిక్కుకున్న తెలంగాణవాసుల క్షేమం కోసం అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దిల్లీలోని తెలంగాణభవన్‌, రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హెల్ప్‌లైన్ సెంటర్లకు రాత్రి నుంచి 75 ఫోన్‌ కాల్స్ వచ్చినట్లు సీఎస్‌ వెల్లడించారు.

దిల్లీలోని తెలంగాణ భవన్​ రెసిడెంట్​ కమిషనర్​.. విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారని సీఎస్​ చెప్పారు. ఉక్రెయిన్​లో మొత్తం ఎంతమంది ఉన్నారన్న సమాచారం ఇప్పటి వరకు లేదన్నారు. కన్సల్టెన్సీల ద్వారా వివరాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్​లో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడుతున్నామని.. కౌన్సిలింగ్ ఇస్తున్నామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.

తెలంగాణ సచివాలయంలో సంప్రదించాల్సి నెంబర్లు..

ఈ.చిట్టిబాబు ఏఎస్​ఓ : 040-23220603

ఫోన్ నంబర్ : +91 9440854433

ఈ -మెయిల్ ఐడీ : so_nri@telanagan.gov.in

దిల్లీ తెలంగాణ భవన్​లో సంప్రదించాల్సిన నెంబర్లు..

విక్రమ్​సింగ్​మాన్ : +91 7042566955

ABOUT THE AUTHOR

...view details