ETV Bharat / state

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మైలవరం విద్యార్థి.. ఆందోళనలో తల్లిదండ్రులు

author img

By

Published : Feb 25, 2022, 1:36 PM IST

Parents concern: ఉన్నత విద్యకోసం ఉక్రెయిన్‌ పంపితే యుద్ధవలయంలో చిక్కుకోవాల్సి వచ్చిందని... కృష్ణాజిల్లా మైలవరానికి చెందిన హేమంత్ కుమార్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ కుమారుడుని క్షేమంగా తిరిగి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.

Telugu Students @ Ukraine
Telugu Students @ Ukraine

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మైలవరం విద్యార్థి.. ఆందోళనలో తల్లిదండ్రులు

Parents concern: ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు.. ఆందోళనలో కూరుకుపోయారు. వారికి అక్కడ ఏమవుతుందోనంటూ తల్లిదండ్రులు బెంగపడుతున్నారు. కృష్ణాజిల్లా మైలవరంలో తాపీ మేస్త్రిగా విధులు నిర్వహిస్తున్న మాధు శ్రీనివాసరావు కుమారుడు... హేమంత్ కుమార్ ఉక్రెయిన్​లోని కాచ్యులో మెడిసిన్ ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడు. రష్యా.. ఉక్రెయిన్​పై దాడులకు పాల్పడుతున్న తరుణంలో హేమంత్ భారతదేశానికి తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తూ... అక్కడే ఉండిపోయాడు. దీంతో హేమంత్ తల్లిదండ్రులు భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

ఉక్రెయిన్ ఇండియన్ ఎంబసీ అధికారులు హేమంత్ కుమార్​తో పాటు భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రదేశానికి తరలించారు. గురువారం సాయంత్రం తల్లిదండ్రులకు అక్కడి పరిస్థితులను మెసెజ్ చేయడంతో అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ కుమారుడుని క్షేమంగా తిరిగి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

Telugu Students @ Ukraine: 'ఉక్రెయిన్​లో ఉన్న మా పిల్లలను స్వదేశానికి రప్పించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.