ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వార్షిక పరీక్షలు లేకుండా.. పాస్ చేసే ఆలోచన లేదన్న ఇంటర్‌ బోర్డు

By

Published : Mar 26, 2021, 6:05 PM IST

వార్షిక పరీక్షలు లేకుండా ఇంటర్మీడియట్‌ విద్యార్థులను పాస్ చేసే ఆలోచన లేదని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్‌ జలీల్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో మే 1 నుంచి జరగనున్న వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పర్యావరణం, నైతిక విలువల పరీక్షలు మాత్రం అసైన్‌మెంట్‌ రూపంలో నిర్వహిస్తామని తెలిపారు.

Face to face with Inter Board Secretary Syed Umar Jalil
ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్ తో ముఖా ముఖి

వార్షిక పరీక్షలు లేకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులను పాస్ చేసే ఆలోచన లేదని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. మే 1 నుంచి జరగనున్న వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నామని.. రెండు రోజుల్లో హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

ఇంటర్‌ పర్యావరణం, నైతిక విలువల పరీక్షలు అసైన్​మెంట్ రూపంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వాటిని తొలుత ఏప్రిల్ 1, 3 తేదీల్లో జరపాలని గతంలో నిర్ణయించామని... కరోనా తీవ్రత వల్ల అసైన్‌మెంట్ రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. ఏప్రిల్ 7 నుంచి జరిగే ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా పడే అవకాశం ఉందని చెబుతున్న ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్‌ జలీల్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...

ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్ తో ముఖా ముఖి

ఇదీ చదవండి:ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించం: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details