ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Donations to TDP: తెదేపాకు భారీ విరాళాలు... అభినందించిన లోకేశ్​

By

Published : May 19, 2022, 8:05 PM IST

Donations to TDP: తెలుగుదేశం పార్టీ సభ్వత్య నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకోవటంతో పాటు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధికి పలువురు విరాళలు ఇచ్చారు. వీరికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అభినందనలు తెలిపారు.

Donations to TDP
తెదేపాకు భారీ విరాళాలు

Donations to TDP: తెలుగుదేశం పార్టీ సభ్వత్య నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకోవటంతో పాటు కార్యకర్తల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధికి భారీ విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా గుంటూరుకు చెందిన భాష్యం ప్రవీణ్ రూ.10 లక్షలు, చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలానికి చెందిన కుర్రా అప్పారావు, కారంచేడుకు చెందిన యార్లగడ్డ కృష్ణ రూ.5 లక్షల చొప్పున విరాళాలు ఇచ్చారు.

కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెంకు చెందిన ఇంటూరి నాగేశ్వరావు రూ. 5 లక్షల 116, అమలాపురానికి చెందిన వీఎస్​ఆర్​ రావు రూ.5.50 లక్షలు విరాళాలు అందచేసినట్లు పార్టీ ప్రకటించింది. కార్యకర్తల సంక్షేమం కోసం విరాళాలు ఇస్తున్న నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అభినందనలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి పాటుపడుతున్న వారికి, పార్టీ కోసం త్యాగాలు చేస్తున్నవారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చిన విరాళాలు కార్యకర్తల సంక్షేమం, వారి పిల్లల చదువులకు వినియోగిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details