ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TIRUPATI RAINS: జలదిగ్బంధంలో తిరుపతి.. వరద ముంపులో కాలనీలు

By

Published : Nov 20, 2021, 10:34 AM IST

Updated : Nov 20, 2021, 11:16 AM IST

జలదిగ్బంధంలో తిరుపతి

తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇళ్లల్లో వరద ప్రవాహంతో ముంపుప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వరద ముంపు నుంచి తిరుపతి ఇంకా తేరుకోలేదు. చాలా కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరదపోటుకు చెరువులు తెగి నివాస ప్రాంతాలలోకి వరద పోటెత్తుతూనే ఉంది. ప్రధానంగా పద్మావతి మహిళ యూనివర్శిటీ, లింగేశ్వర నగర్‌, కేశవాయినగుంట, ఆటోనగర్‌, యశోదనగర్‌, సరస్వతీనగర్‌, ఉల్లిపట్టెడ, శ్రీకృష్ణనగర్‌ ముంపులోనే ఉన్నాయి. గాయిత్రీనగర్​లో 2 వేల కుటుంబాలు ఇళ్ల నుంచి బయటకురాలేని పరిస్థితి నెలకొంది.

మేం పనులు చేస్తుండగా ఒక్కసారిగా వరద పోటెత్తింది. చూస్తుండగానే సెల్లర్ అంతా నీటితో నిండిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మూడు రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.

- ముంపు బాధితుడు

జలదిగ్బంధంలో తిరుపతి

వరదలతో లోతట్టు ప్రాంతాలు తీవ్ర ప్రభావితమయ్యాయి. బాధితులకు ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం

-స్థానిక అధికారి

జలదిగ్బంధంలో తిరుపతి

మెట్లమార్గానికి మరమ్మతులు...

ఏకధాటిగా కురిసిన వర్షాలకు తిరుమల వెళ్లే శ్రీవారి నడక మార్గం పూర్తిగా ధ్వంసమైంది. కొండ పైనుంచి వచ్చిన వరద, పెద్దపెద్ద బండరాళ్లు, బురదతో మార్గమంతా నిండిపోయింది. ఎంతో నాణ్యతతో, పటిష్టంగా ఉండే నడక మార్గం నిర్మాణం ఈ స్థాయిలో ధ్వంసమైందంటేనే... వరద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మార్గాన్ని మళ్లీ పునరుద్ధరించాలంటే ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తిరుమల శ్రీవారి మెట్ల మార్గం కొండపై నుంచి వచ్చిన వరదతో మెట్ల ప్రాంతానికి చేరుకునే రహదారి దెబ్బతినింది. పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

జలదిగ్బంధంలో తిరుపతి

ఇవీచదవండి.

Last Updated :Nov 20, 2021, 11:16 AM IST

ABOUT THE AUTHOR

...view details