ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Accident: లారీ, కారు ఢీ.. ఐదుగురు మృతి

By

Published : Aug 6, 2021, 4:30 PM IST

లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండలంలో ఈ ఘటన జరిగింది.

road accident
రోడ్డు ప్రమాదం

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. మెదక్‌ జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన పద్మ(30), అంబదాస్‌(40) దంపతుల కుమారుడు వివేక్‌(6) అనారోగ్యానికి గురి కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు.

అనంతరం స్వగ్రామానికి తిరిగి వస్తుండగా.. చౌటకూర్‌ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న పుల్కల్‌ ఎస్సై నాగలక్ష్మి సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:murder: ఓ భర్త కిరాతకం.. సినీ ఫక్కీలో భార్యను కడతేర్చాడు

ABOUT THE AUTHOR

...view details