ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రధాన వార్తలు @ 7 PM

By

Published : Apr 5, 2021, 7:00 PM IST

టాప్ టెన్ న్యూస్

7 pm top ten news
టాప్ టెన్ న్యూస్

  • రాష్ట్రంలో కొత్తగా 1,326 కరోనా కేసులు.. 5 మరణాలు

రాష్ట్రంలో కరోనా మళ్లీ కలవరపెడుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలోనే 1,326 కరోనా కేసులు, 5 మరణాలు నమోదు కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు, నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విజయవాడలో అమానవీయం..10 కుటుంబాలు కుల బహిష్కరణ

విజయవాడలో కుల బహిష్కరణ వివాదం కలకలం రేపుతోంది. చిట్టినగర్ కొండపై నివసించే ఒకే వర్గానికి చెందిన 10 కుటుంబాలను ఆ కులపెద్దలు బహిష్కరించటం సంచలనంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దంపతులపై కుప్పకూలిన సెల్ టవర్.. భర్త మృతి

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులపై సెల్‌ టవర్‌ కూలి పడింది. ఈదురు గాలులతో టవర్‌ కూలినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అమరావతి ఆందోళనలు... 475వ రోజూ అదే హోరు

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 475 వ రోజూ ఉద్ధృతంగా కొనసాగాయి. తుళ్లూరు, అనంతవరం, వెంకటపాలెం, మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఒంటికాలుతో బంగాల్​లో విజయం-​ రెండు కాళ్లతో దిల్లీపై గురి'

బంగాల్​లో విజయం సాధించిన తర్వాత తమ లక్ష్యం దిల్లీ పీఠంపైనేనని చెప్పారు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ. బీజాపుర్​ ఎన్​కౌంటర్, కరోనా విజృంభణపై కేంద్రాన్ని తప్పుబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నక్సల్స్ చెరలో కోబ్రా కమాండో- నిజమెంత?

కోబ్రా కమాండో రాకేశ్వర్​ సింగ్​ను కిడ్నాప్​ చేశామన్న నక్సలైట్ల ప్రకటనలో నిజానిజాలు తేల్చేందుకు భద్రతా సంస్థలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు...​ రాకేశ్వర్​ అపహరణపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయన్ను నక్సల్స్ చెర నుంచి విడిపించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సైబర్ బీమా గురించి ఇవి తెలుసా?

ప్రపంచంలో అత్యధిక సైబర్ దాడులకు గురయ్యే దేశాలలో అమెరికా, చైనా అగ్ర‌స్థానంలో ఉన్నాయి. మార్ష్‌-ఆర్ఐఎంఎస్ ఇటీవల జరిపిన ఉమ్మడి అధ్యయనం ప్ర‌కారం భార‌త‌దేశంలోనూ పెద్ద ఎత్తున సైబర్ దాడులు, డేటా దొంగతనం వంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌వ‌చ్చ‌ని తెలిసింది. ఈ క్రమంలో సైబర్​ బీమా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు నిపుణులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇండోనేసియా వరద బీభత్సంలో 55కు మృతులు

ఇండోనేసియాలో భారీ వర్షాలు సహా కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 55కు చేరింది. 40 మందికి పైగా గల్లంతయ్యారు. సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అందుకే ఇంకా క్రికెట్ ఆడుతున్నా: అమిత్ మిశ్రా

తన ఆట గురించి ఎవరెమనుకున్న పట్టించుకోనని సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అన్నాడు. క్రికెట్​పై ఇంకా ఇష్టం ఉండటం వల్లే రాణిస్తున్నానని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'వకీల్​సాబ్​' సెన్సార్​ పూర్తి.. పాటతో బ్యాచ్​లర్

పవన్​కల్యాణ్​ 'వకీల్​సాబ్​' చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్​ను జారీ చేసింది సెన్సార్​ బోర్డు. అఖిల్​, పూజాహెగ్డే నటించిన 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్'​ సినిమాలోని మరో పాట విడుదలై ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details