ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కమనీయం.. రమణీయం.. ఇంద్రకీలాద్రి మహోత్సవం

By

Published : Oct 9, 2019, 6:24 AM IST

పది రోజులపాటు వివిధ అలంకరణలతో దర్శనమిచ్చిన అమ్మవారి శరన్నవరాత్రులు ఘనంగా ముగిశాయి. దసరా ఉత్సవాల్లో చివరిరోజైన(మంగళవారం) విజయదశమి నాడు అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య పూర్ణాహుతితో అమ్మవారి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి.  మంగళవారం సాయంత్రం... గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం కన్నులవిందుగా సాగింది.

కమనీయం.. రమణీయం.. ఇంద్రకీలాద్రి మహోత్సవం

కమనీయం.. రమణీయం.. ఇంద్రకీలాద్రి మహోత్సవం
దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి పులకించింది. స్వర్ణకావచాలంకృత దుర్గాదేవి నుంచి విజయరూపిణి దుర్గాదేవి వరకు 10 రోజులపాటు అమ్మవారి వివిధ అలంకారాల్లో భక్తులను అనుగ్రహించారు. నవరాత్రి ఉత్సవాల్లో ఆఖరి రోజైన విజయదశమినాడు అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జాము నుంచి క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారి దీక్ష తీసుకున్న భవానీలు పెద్దసంఖ్యలో అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. జై దుర్గ నినాదాలతో ఇంద్రకీలాద్రి ప్రతిధ్వనించింది.

ఎటువంటి క్షామం లేకుండా ప్రజలంతా సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని ఏటా ఆశ్వయుజ పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారికి ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8 వరకూ జరిగిన దసరా ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఘనంగా సాగాయి. దసరా ఉత్సవాల ప్రారంభం నుంచి విజయదశమి వరకు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల నుంచి దుర్గమ్మకు సారె, పట్టువస్త్రాలు తీసుకొచ్చారు.

విజయదశమి రోజున మధ్యాహ్నం 12 గంటలకే ఉత్సవాలు ముగియడం వలన ఉదయం నుంచి దుర్గమ్మ దర్శనం కోసం ప్రముఖులు తరలివచ్చారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రవాణా శాఖ ఎండీ కృష్ణబాబు, తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రబాబు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రముఖులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి... దర్శనం అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వచనాలు అందజేశారు.

మధ్యాహ్నం 12 గంటల నుంచి యాగశాలలో దుర్గగుడి స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. దుర్గ గుడి ఈవో సురేష్ కుమార్ దంపతులు క్రతువులో పాల్గొని పూర్ణాహుతి నిర్వహించారు. దసరా ఉత్సవాలు వైభవంగా ముగియడం పట్ల ఈవో సంతోషం వ్యక్తం చేశారు. సాయంత్రం నగరోత్సవం అనంతరం కృష్ణానదిలో గంగా సమేత దుర్గామల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం నిర్వహించారు.

ఇదీ చదవండి :

అమ్మవారి ఉత్సవాలకు సర్వం సిద్ధం

Intro:శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని సాయి సష్ఠంగా నిలయం శ్రీ విజయదుర్గాదేవి ఉప పీఠంనందు దేవి శరన్నవారాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణ కో ఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ పరివేక్షణలో వేదపండితుల ఆధ్వర్యంలో దేవి శరన్నవారాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం శ్రీ సర్వానంద మయ చక్ర స్వామిని శ్రీ మహాత్రిపుర సుందరి దేవి స్వరూప శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం మరియు సాయిబాబా మహాసమాది చెందిన సందర్భంగా ప్రత్యేక పూజలు, మహా పూర్ణాహుతి,అమ్మవారికి అభిషేకాలు భక్తి శ్రద్ధలతో వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.Body:1Conclusion:2

TAGGED:

ABOUT THE AUTHOR

...view details