ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CYBER CRIME: కొత్త రకమైన మోసాలకు తెర... లింకులు పంపించి..

By

Published : Oct 1, 2021, 5:31 PM IST

పండుగ వేళ మీకు కారు బహుమతిగా వచ్చింది. చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పి.. పలువురికి షేర్ చేస్తే చాలు గెలుచుకోవచ్చంటూ ఎర వేస్తారు. ఇలా వాట్సప్ సందేశాల ద్వారా వచ్చిన లింకులు క్లిక్ చేస్తే మీరు సైబర్ నేరగాళ్ల(cyber crime telangana) వలలో పడినట్లే. ఇలాంటి సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సైబర్ మోసాలు
సైబర్ మోసాలు

సైబర్ మోసాలు

దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అంటూ సైబర్ నేరస్తులు కొత్తరకమైన మోసాలకు(cyber crime telangana) తెరలేపుతున్నారు. కారు వంటివి బహుమతిగా వచ్చాయని ఎరవేసి.. ఆ లింకులు పలువురికి షేర్ చేయాలని కోరుతారు. అలా రోజుకో తీరుగా నగదు కాజేస్తున్నారు. ఇటువంటి లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.

తస్మాత్ జాగ్రత్త

తాజాగా అమెజాన్, టాటా గ్రూప్ పేరుతో వాట్సాప్ లింక్స్ పంపుతున్నారు. వాట్సాప్‌కు వచ్చిన లింక్‌పై క్లిక్ చేయగానే... కారు గెలుచుకున్నారని చెబుతారు. ఆ కారు తీసుకునేందుకు వాట్సాప్ గ్రూపుల్లో పంపాలని అంటున్నారు. తర్వాత లింకులు పంపించి మదుపు చేయాలని రూ.లక్షలు నగదును బదిలీ చేసుకుంటున్నారని(cyber crime telangana) సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. అటువంటి లింకులపై క్లిక్ చేయకూడదని సూచిస్తున్నారు.

అమెజాన్ పేరుతో జాబ్ల్ అంటూ మెసేజ్‌లు పంపుతున్నారు. కింద కాంటాక్టు అంటూ ఒక నంబర్ ఇస్తున్నారు. ఆ నంబర్‌పై క్లిక్ చేయగానే డైరెక్టు వాట్సాప్‌కు పోతుంది. వెంటనే ఆర్‌ యూ ఇంట్రెస్ట్ ఆన్ ఎర్న్ మనీ అని మెసేజ్ వస్తుంది. ఎస్ అంటే ఒక లింకు పంపుతారు. అలా టాస్కులు ఇస్తారు. ఎక్కువ డబ్బులు కావాలంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని నమ్మిస్తారు. తొలుత ఆ డబ్బులను వాడుకునే సౌకర్యం కల్పిస్తారు. తర్వాత రూ.10వేలు దాటితే వాడుకోవడానికి వీలు ఉండదు. ఇలా ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ చేయిస్తారు. కొంతకాలం తర్వాత ఆ యాప్ బాధితుల ఫోన్లలో బ్లాక్ అవుతుంది. ఇటువంటి లింకులను క్లిక్ చేయకుండా ఉండాలి.

-కేవీఎం ప్రసాద్, సైబర్ క్రైం ఏసీపీ

ఇటీవల సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త రూట్లలో మోసాలకు పాల్పడుతున్నారు. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ మినహాయింపుల అనంతరం వేగంగా వృద్ధి చెందుతున్న ప్రయాణాలు, విహారాలు(Cyber crimes in Tourism), సరకు రవాణా విభాగాల్లో సైబర్‌ నేరాల సంఖ్య బాగా పెరిగింది. ఇంతకు ముందు మోసగాళ్లు ఎక్కువగా ఆర్థిక నేరాలకు పాల్పడగా, ఇప్పుడు తమ దృష్టిని ఈ రంగాల వైపు మళ్లించారని క్రెడిట్‌ స్కోర్‌ సంస్థ ట్రాన్స్‌యూనియన్‌ నివేదికలో వెల్లడయ్యింది. 2021 రెండో త్రైమాసికంలో అంతర్జాతీయంగా గేమింగ్‌, ప్రయాణాలు, విహారాలలో అనుమానాస్పద, మోసపూరిత ప్రయత్నాలు కనిపించాయి. అంతర్జాతీయంగా చూసినప్పుడు ఇది 393 శాతం పెరిగింది. 2020 రెండో త్రైమాసికంతో పోలిస్తే.. భారత్‌లో ప్రయాణాలు, విహారాల(Cyber crimes in Tourism)లో 269.72శాతం, కమ్యూనిటీల్లో (ఆన్‌లైన్‌ డేటింగ్‌, ఇతర ఆన్‌లైన్‌ ఫోరాలు) 267.88 శాతం, లాజిస్టిక్స్‌లో 94.84 శాతం మోసాలు పెరిగాయి. దాదాపు 40వేలకు పైగా వెబ్‌సైట్లు, యాప్‌లను విశ్లేషించి, ట్రాన్స్‌యూనియన్‌ ఈ నివేదికను విడుదల చేసింది.

ఇవీ చదవండి:

Irrigation Projects: నిర్ణీత సమయంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి: సీఎం జగన్

TIRUMALA: ఈనెల 11న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details