ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CORONA CASES: తెలంగాణలో కొత్తగా 359 కరోనా కేసులు, ఇద్దరు మృతి

By

Published : Aug 20, 2021, 10:28 PM IST

రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 359 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారిన పడి ఇద్దరు మరణించారు. కరోనా నుంచి కొత్తగా 494 మంది కోలుకున్నారు.

CORONA CASES
CORONA CASES

తెలంగాణలో కొత్తగా 359 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 73,899 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 359 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,54,394కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,854కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 494 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,728 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details