ఆంధ్రప్రదేశ్

andhra pradesh

KISHAN REDDY: యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కిషన్​రెడ్డి

By

Published : Aug 21, 2021, 9:30 AM IST

జన ఆశీర్వాదయాత్రలో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్మాణాన్ని కిషన్ రెడ్డి పరిశీలించారు.

KISHAN REDDY
KISHAN REDDY

మూడో రోజు జన ఆశీర్వాదయాత్రలో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. యాత్రలో భాగంగా రెండో రోజు పర్యటన అనంతరం యాదాద్రిలోని హరిత హోటల్లో కిషన్​ రెడ్డి రాత్రి బస చేశారు. తెల్లవారు జామునే యాదాద్రిలోని స్వామిని దర్శించుకున్నారు. కిషన్​రెడ్డికి ఆలయ ఈవో, అర్చకులు ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణలతో కిషన్ రెడ్డిని ఆశీర్వదించి... స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ నూతన నిర్మాణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. కేంద్రమంత్రికి ఆలయ నిర్మాణాల గురించి ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి వివరించారు.

కాసేపట్లో యాదాద్రి నుంచి జన ఆశీర్వాదయాత్ర ప్రారంభమై ఘట్​కేసర్ నుంచి ఉప్పల్​ మీదుగా సికింద్రాబాద్​ పార్లమెంట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది. సాయంత్రం 6 గంటలకు భాజపా రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటుంది. పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభతో యాత్ర ముగియనుంది.

ఇదీ చూడండి: 'తాలిబన్​ సర్కారు ఏర్పాటులో చైనాదే ప్రధాన పాత్ర'

ABOUT THE AUTHOR

...view details