ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

By

Published : Aug 22, 2022, 12:47 PM IST

BIRTHDAY WISHES TO CHIRU సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్‌గా సినీ ప్రేక్షక హృదయాల్లో స్థిరపడిన చిరంజీవి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు. అన్నయ్య పుట్టినరోజున తమ్ముడు పవన్​ కల్యాణ్​ భావోద్వేగమైన ట్వీట్​ చేశారు.

BIRTHDAY WISHES TO CHIRU
BIRTHDAY WISHES TO CHIRU

CBN WISHES TO MEGASTAR మెగాస్టార్‌ చిరంజీవికి.. ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు .చిరంజీవి నిండు నూరేళ్లూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని.. తెలుగుదేశం చంద్రబాబు ఆకాంక్షించారు. మెగాస్టార్‌గా సినీ ప్రేక్షక హృదయాల్లో స్థిరపడిన చిరంజీవి చేస్తున్న.. సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు.

PAWAN WISHES TO MEGA HERO జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా.. చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాషలో.. తనకు ఇష్టమైన పదం అన్నయ్య అని ట్వీట్ చేశారు. దోసెడు సంపాదిస్తే.. గుప్పెడు దానం చేయాలనే చిరంజీవి జీవన విధానాన్ని ఎంత పొగిడినా తక్కువేనని.. పేర్కొన్నారు. ప్రతి నమస్కారం కూడా చేయలేని కుసంస్కారికి కూడా.. చేతులెత్తి నమస్కరించే సంస్కారం చిరంజీవి సొంతమని తెలిపారు. అలాంటి సుగుణాలున్న అన్నయ్యకు తమ్ముణ్ణి కావడం పూర్వ జన్మ సుకృతమని.. పవన్‌ ట్వీట్‌ చేశారు.

‘‘అన్నయ్య.. తెలుగు భాషలో నాకు ఇష్టమైన పదం. నేను ఆరాధించే చిరంజీవిగారిని అలా పిలవడమే అందుకు కారణమేమో. ఆయన్ను అన్నయ్యా అని పిలిచినప్పుడల్లా అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. అలాంటి అన్నయ్యకు జన్మదినం సందర్భంగా మనసా వాచా కర్మణా అనురాగపూర్వక శుభాకాంక్షలు. ఆయన గురించి నాలుగు మాటలు చెప్పాలంటే ఒకింత కష్టమే. ఎందుకంటే.. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. ఆయన సాధించిన విజయాలు, ఆయన కీర్తిప్రతిష్ఠలు, ఆయన సేవాతత్పరత గురించి తెలుగువారితోపాటు యావత్‌ భారత్‌కీ తెలుసు. అన్నయ్యలోని గొప్ప మానవతావాది గురించి చెప్పడమే నాకు ఇష్టం. ఆయన జీవన విధానాన్ని ఎంత పొగిడినా తక్కువే. చెమటను ధారగా పోసి సంపాదించిన దాంట్లోంచి ఎందరికో సాయం చేశారు. పేదరికంతో బాధపడుతున్న, అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన, చదువుకు దూరమైన వారి గురించి తెలియగానే తక్షణమే స్పందించి సహాయం చేసే సహృదయుడు అన్నయ్య.

‘‘కొవిడ్‌ సమయంలో పనులు లేక సినీ కార్మికులు ఆకలితో అలమటించకుండా ఆయన చూపిన దాతృత్వం.. బ్లడ్‌ బ్యాంక్‌ స్థాపించి లక్షలాది మందితో ఏర్పరచుకున్న రక్త సంబంధం.. వేలాది గుప్త దానాలు.. ఇలా ఒకటీ రెండూ కాదు ఎన్నో. ఇటీవల ప్రకటించిన ఉచిత ఆస్పత్రి స్థాపన వరకూ చేస్తున్న కార్యక్రమాలు ఆయనలోని మానవతామూర్తిని తెలియజేస్తాయి. అన్నింటికన్నా మిన్న ఆయనలోని ఒదిగి ఉండే లక్షణం. తాను కలవబోయే వ్యక్తి ప్రతి నమస్కారం కూడా చేయలేని కుసంస్కారి అయినప్పటికీ తను చేతులెత్తి నమస్కరించే సంస్కారం చిరంజీవి సొంతం. వయసు తారతమ్యాలు, వర్గ వైరుధ్యాలు, కులమతాలకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకునే విశాల హృదయుడు అన్నయ్య. అలాంటి సుగుణాలున్న అన్నయ్యకు నేను తమ్ముణ్ణి కావటం నా పూర్వజన్మ సుకృతం. ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, నాకు తల్లిలాంటి మా వదినమ్మ సహచర్యంలో ఆయన నిండు నూరేళ్లు చిరాయువుగా వర్థిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. అన్న రూపంలో ఉన్న మా నాన్నకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా’’ పవన్‌ కల్యాణ్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details