ETV Bharat / entertainment

చిరు, మణిరత్నం కాంబోలో సినిమా, నిజమేనా

author img

By

Published : Aug 21, 2022, 10:12 PM IST

ఎంతో కాలంగా మెగాస్టార్​ అభిమానులు ఎదురు చూస్తున్న చిరు-మణిరత్నం కాంబోలో ఓ చిత్రం రానుందా. ఈ విషయంపై మణిరత్నం పరోక్షంగా సిగ్నల్ ఇచ్చారా అంటే నెటిజన్లు అవుననే అంటున్నారు. అదెందుకో తెలుసుకుందామా.

Etv Bharat
Etv Bharat

Fans awaiting for chiru mani ratnam combo: స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న విజువల్‌ వండర్‌ "పొన్నియిన్‌ సెల్వన్‌". రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా తొలి భాగం సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల చిత్రంలోని 'చోళ చోళ' పాటను తెలుగులో విడుదల చేశారు. ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ.. తాను ఈ సినిమా తీయడానికి 'బాహుబలి' దారి చూపిందని అన్నారు.ఈ సందర్భంగా రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చిరంజీవికి కూడా ధన్యవాదాలు అన్నారు. ఆయనకు ఎందుకు థ్యాంక్స్‌ చెప్పానో తర్వాత చెబుతానంటూ మాట దాట వేశారు. ప్రస్తుతం ఈ కామెంట్‌పై టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

.
పొన్నియన్​ సెల్వన్​ సినిమా పోస్టర్​

చిరంజీవి, మణిరత్నం కాంబినేషన్‌లో సినిమా కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్పటివరకూ అది కార్యరూపం దాల్చలేదు. మణిరత్నం దీనిపై పరోక్షంగా సిగ్నల్ ఇచ్చారా అని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు, 'పొన్నియిన్‌ సెల్వన్‌' కోసం చిరు ఏం చేసి ఉంటారా? అని సినీ అభిమానులు ఆలోచిస్తున్నారు. పార్ట్‌-1, లేదా పార్ట్‌-2లో ఏమైనా అతిథి పాత్రలో నటించారా? అన్న అనుమానం కలుగుతోంది. అదే సమయంలో తెలుగులో ఈ సినిమా కథను, ఇందులో పాత్రలను వెండితెరపై చిరంజీవి పరిచయం చేయనున్నారని కూడా టాక్‌ వినిపిస్తోంది.

ఈ చిత్రంలో నటించిన విక్రమ్‌, కార్తి, త్రిష, ఐశ్వర్యరాయ్‌ తదితరులు తెలుగు ప్రేక్షకులు పరిచయమే. అయితే, తమిళంలో కనపడుతున్న క్రేజ్‌ తెలుగులో కనిపించటం లేదు. ఈ క్రమంలో సెప్టెంబరులో మరో కార్యక్రమాన్ని నిర్వహించాలని చిత్ర బృందం యోచిస్తోంది. ఇటీవల జరిగిన ఈవెంట్‌లోనూ ఇదే విషయాన్ని అందరూ చెప్పుకొచ్చారు. ఒకవేళ సెప్టెంబరులో నిర్వహించే కార్యక్రమానికి చిరంజీవి అతిథిగా వస్తారేమో చూడాలి. ఇదే నిజమైతే తెలుగులో పొన్నియిన్‌ సెల్వన్‌ ప్రచారానికి ఇది ఎంతగానో ఉపయోపడుతుంది. అన్నట్లు తెలుగులో ఈ సినిమా విడుదల హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు దక్కించుకున్నారు. మరి మణిరత్నం మదిలో ఉన్నది ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

.
పొన్నియన్​ సెల్వన్​లో విక్రమ్​

ఇదీ చదవండి:

చిరు ఫ్యాన్స్​కు మరో గుడ్​న్యూస్, గాడ్​ ఫాదర్ టీజర్ వచ్చేసింది

కిరాక్ లుక్​లో చిరు, భోళాశంకర్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.