ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైకాపా ప్రజావ్యతిరేక విధానాలపై పార్లమెంట్​లో పోరాడండి: చంద్రబాబు

By

Published : Jan 29, 2022, 7:03 AM IST

రాష్ట్రంలో క్యాసినో నిర్వహించి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు వైకాపా నేతలు దెబ్బకొట్టారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ వ్యవహారాన్ని పార్లమెంటులో లేవనెత్తడంతోపాటు ఈడీ, డీఆర్‌ఐ, ఎన్‌సీబీలకు ఫిర్యాదు చేయాలని పార్టీ ఎంపీలకు సూచించారు. ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్రాన్ని ఏం అడుగుతున్నారో కూడా బయటికి చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, దిల్లీ పర్యటనలతో ఏం సాధించారో జగన్‌ కూడా చెప్పలేకపోతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.

cbn fire on ysrcp in parliamentary meet
cbn fire on ysrcp in parliamentary meet

రాష్ట్రంలో క్యాసినో నిర్వహించి తెలుగు సంప్రదాయాలకు వైకాపా నేతలు గండికొట్టారని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ వ్యవహారాన్ని పార్లమెంటులో లేవనెత్తడంతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని పార్టీ ఎంపీలకు సూచించారు. సోమవారం నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానుండటంతో చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలపై సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేక త్రీవంగా నష్టపోతున్నారని ఈ అంశాలను పార్లమెంటులో లేవనెత్తాలని సూచించారు. విభజన పెండింగ్‌ అంశాలపై పార్లమెంట్‌లో గళం వినిపించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే కొత్త జిల్లాల పేరుతో వైకాపా ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. ఉద్యోగుల పీఆర్సీతోపాటు, ఇతర సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే వీటిని తీసుకొచ్చారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details