ఆంధ్రప్రదేశ్

andhra pradesh

jagan disproportionate assets case: పెన్నా కేసు నుంచి రాజగోపాల్‌ను తొలగించొద్దు: సీబీఐ

By

Published : Jun 29, 2021, 5:17 PM IST

పెన్నా కేసు నుంచి రాజగోపాల్‌ను తొలగించొద్దని సీబీఐ కోర్టును.. కేంద్ర దర్యాప్తు సంస్థ కోరింది. ఈ మేరకు రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్‌ (discharge petition)పై సీబీఐ(CBI).. కౌంటరు దాఖలు చేసింది. పెన్నా సిమెట్స్ ఛార్జీ షీట్​పై విచారణను కోర్టు.. జులై 6కు వాయిదా వేసింది.

cbi court  hearing the penna chargesheet
jagan disproportionate assets cases

జగన్ అక్రమాస్తుల కేసు (jagan disproportionate assets case)ల్లో పెన్నా ఛార్జ్‌షీట్‌పై సీబీఐ కోర్టు (CBI Court) విచారణ జరిపింది. గనుల శాఖ మాజీ అధికారి రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్‌ (discharge petition)పై సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. పెన్నా కేసు నుంచి రాజగోపాల్‌ను తొలగించవద్దని కోర్టును కోరింది. శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. పీఆర్ ఎనర్జీ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ సమయం కోరింది. సాంకేతిక కారణాలతో పయనీర్ హాలిడే రిసార్ట్స్ డిశ్చార్జ్ పిటిషన్ ను కోర్టు వెనక్కి ఇచ్చింది. పెన్నా సిమెట్స్ ఛార్జీ షీట్​పై విచారణను జులై 6కు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details