ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శంషాబాద్ విమానాశ్రయంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం

By

Published : Nov 28, 2020, 9:56 PM IST

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాగేజీ ట్రాలీల ట్రాకింగ్‌, నిర్వాహణ కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. ఇందుకోసం అధునాతన స్మార్ట్‌ బ్యాగేజీ ట్రాలీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ట్రాలీలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందుతాయని విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి.

shamshabad-international-airport
shamshabad-international-airport

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధునాతన స్మార్ట్‌ బ్యాగేజీ ట్రాలీలు అందుబాటులోకి వచ్చాయి. బ్యాగేజీ ట్రాలీల ట్రాకింగ్‌, నిర్వాహణ కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. దీని వల్ల ప్రయాణికులు ట్రాలీల కోసం వేచి చూసే సమయం తగ్గిపోతుంది. విమానాశ్రయంలో ట్రాలీ అవసరాలు వేగంగా మారుతుంటాయి. ప్రయాణికులు రాకపోకలు సాగించే డిపార్చర్‌, అరైవల్‌ ర్యాంప్‌ల వద్ద ట్రాలీలు ఎక్కువగా అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో ప్రారంభించిన స్మార్ట్ ట్రాలీ మేనేజ్​మెంట్ ద్వారా ట్రాలీలను అవసరమైన చోటికి, సరైన సమయంలో తరలించవచ్చు.

స్మార్ట్ ట్రాలీ మేనేజ్​మెంట్ ద్వారా రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్యను ముందుగానే అంచనా వేసి, దానికి అనుగుణంగా బ్యాగేజ్ ట్రాలీలను అక్కడికి తరలించవచ్చు. అంతర్గత అలర్ట్ మెకానిజం ద్వారా ఎవరైనా ట్రాలీలను నో ఎయిర్ పోర్ట్ జోన్​లోకి తీసుకుపోతే వెంటనే అలర్ట్ మెసేజ్ వచ్చేలా ఏర్పాటు చేశారు. దీని వల్ల వెంటనే ట్రాలీలు ఎక్కడున్నాయో గుర్తించి, అవి ఎయిర్ పోర్టు పరిసరాలు దాటి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మొత్తంగా ఈ ట్రాలీలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందుతాయని విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details