ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ACHENNAIDU: 'తప్పుడు కేసులతో ఎఫ్​ఐఆర్ పుస్తకాలన్నీ నిండిపోయాయి..!'

By

Published : Sep 13, 2021, 11:59 AM IST

తెదేపా శ్రేణులపై అక్రమ కేసులు పెట్టేందుకే పోలీసులు జీతాలు తీసుకుంటున్నారా అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అలాగే తప్పుడు కేసులు పెట్టిన పోలీసుల పేర్లను గుర్తుంచుకుంటామని.. భవిష్యత్తులో వారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

acchennaidu-fires-on-police-department
'తప్పుడు కేసులతో ఎఫ్​ఐఆర్ పుస్తకాలన్నీ నిండిపోయాయి..!'

వైకాపా రెండేళ్ల పాలనలో తెలుగుదేశం శ్రేణులపై నమోదు చేసిన తప్పుడు కేసులతో ఎఫ్​ఐఆర్ పుస్తకాలన్నీ నిండిపోయాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. తెదేపా నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టేందుకే పోలీసులు జీతాలు తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినందుకు తెలుగుదేశం కార్యకర్త అంజిపై కడప జిల్లా చిన్నమండెం పోలీసులు అక్రమ కేసులు పెట్టడంతోపాటు స్టేషన్‌లో కొట్టి హింసించడాన్ని తీవ్రంగా ఖండించారు. వేధింపుల వెనుక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కండ్రికలో వైకాపా కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేశారని.. అయితే బాధితుల్నే పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. కొందరు పోలీసులు వైకాపా నేతలు చెప్పిందల్లా చేసేందుకు పరిధి దాటి చట్టాల్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. తప్పుడు కేసు పెట్టిన పోలీసుల పేర్లను గుర్తించుకుంటామని భవిష్యత్తులో వారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఇదీ చూడండి:BOARDS MEETING: ఇవాళ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ

ABOUT THE AUTHOR

...view details