ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 AM

By

Published : Jul 28, 2022, 6:58 AM IST

..

7AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 7 AM

  • మెరికలకు మెలికలు.. ట్రిపుల్‌ఐటీల్లో విద్యార్థుల అవస్థలు
    పదోతరగతిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారిని మెరికల్లా తీర్చిదిద్దే ఉద్దేశంతో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ఐటీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నెలకొల్పి 14 ఏళ్లయినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో శాశ్వత అధ్యాపకులు లేరు. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో కలిపి 665 వరకు ఖాళీలు ఉండగా.. ఒప్పంద అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జగన్ అక్రమాస్తుల కేసులో బహ్మానందరెడ్డిపై విచారణ తప్పదు: తెలంగాణ హైకోర్టు
    జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన వాన్‌పిక్‌ ప్రాజెక్టు కేసులో ఆరో నిందితుడైన మాజీ ఐఆర్​ఏఎస్ అధికారి కె.వీ.బ్రహ్మానందరెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై విచారణను నిలిపేయలేమని, ప్రాథమిక దశలోనే ఆయనను కేసు నుంచి తప్పించలేమని కోర్టు పేర్కొంది. రికార్డుల్లో ఉన్న ఆధారాలతో శిక్ష పడుతుందా లేదా అన్నది విచారణ చివర్లో తేలుతుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జలజీవన్‌ మిషన్‌ పనుల్లో జాప్యం.. రాష్ట్రంలో 60.13% ఇళ్లకే కుళాయిలు
    గ్రామాల్లో ప్రజలందరికీ రక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన జలజీవన్‌ మిషన్‌ (జేజేఎం) ప్రాజెక్టు రాష్ట్రంలో నీరుగారుతోంది. జలజీవన్‌ మిషన్‌ పనుల్లో జాప్యం వల్ల రాష్ట్రంలో కేవలం 60.13% ఇళ్లకే కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. ఈ విషయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ 17వ స్థానంలో నిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పోలవరం విలీన మండలాల్లో నేటి నుంచి చంద్రబాబు పర్యటన
    తెదేపా అధినేత చంద్రబాబు పోలవరం విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. తెలంగాణలోని భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ ముంపు ప్రాంతాల్లోని బాధితులను కూడా చంద్రబాబు పరామర్శించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సారా ఇప్పించండి సారూ'... హోంమంత్రికి కల్తీ మద్యం బాధితుడి విజ్ఞప్తి
    Gujarat hooch tragedy: గుజరాత్‌లోని బోటాడ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 42కు చేరిందని హోంమంత్రి హర్ష్​ సంఘ్వీ తెలిపారు. బాధితులను అహ్మదాబాద్​ సివిల్​ ఆస్పత్రి, సర్​ టీ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అర్పిత ఇంట్లో మళ్లీ భారీగా నోట్ల కట్టలు.. యంత్రాలతో లెక్కించేసరికి...
    Arpita mukherjee news: బంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ ఇంట్లో మరోసారి భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. వీటిని లెక్కించేందుకు నగదు లెక్కింపు యంత్రాలను తీసుకురావాలని బ్యాంకు అధికారులకు సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భార్యతో జెలెన్​స్కీ ఫొటోషూట్.. 'యుద్ధం మధ్యలో ఇదేంటి?'
    Zelensky photo shoot: రష్యా దాడులను సమర్థంగా ఎదుర్కొంటూ ప్రజలకు ఆశాకిరణంలా మారిన ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్​స్కీ.. తాజాగా ఓ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. యుద్ధం కొనసాగుతున్న వేళ భార్యతో కలిసి ఆయన ఫొటోషూట్​లో పాల్గొనడమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • BSNLకు భారీ ప్యాకేజీ.. ఆదుకునేందుకు కేంద్రం నిర్ణయం
    నష్టాల ఊబిలో ఉన్న బీఎస్ఎన్​ఎల్​ను ఆదుకునేందుకు కేంద్రం ముందడుగు వేసింది. సంస్థ కోసం రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. 4జీ సేవల విస్తరణ కోసం స్పెక్ట్రమ్ కేటాయించనున్నట్లు తెలిపింది. మరోవైపు, రెండోరోజు 5జీ వేలంలో రూ.1.49 లక్షల కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • IND vs WI: 3-0తో విండీస్‌ను వైట్‌వాష్‌ చేసిన టీమ్‌ఇండియా
    వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలోనూ విజయం సాధించిన భారత్‌.. 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత్‌ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్‌ 137 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • క్యూట్​ లుక్​లో పూర్ణ.. ఫొటోలు అదిరాయిగా!
    'శ్రీమహాలక్ష్మి', 'అవును', 'సీమ టపాకాయ్‌', 'అఖండ' వంటి చిత్రాలతో తెలుగువారిని అలరించిన మలయాళీ నటి పూర్ణ. న్యాయనిర్ణేతగానూ బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆమెకు సంబంధించిన తాజా ఫొటోషూట్​ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఓ సారి చూసేయండి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details