ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Jul 1, 2022, 5:02 PM IST

..

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM

  • ఈ ఏడాది వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు: ఈవో ధర్మారెడ్డి
    TTD EO Dharma Reddy: ఈ ఏడాది అత్యంత వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 27న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయని.. తిరువీధుల్లో స్వామివారు విహరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కౌలు చెక్కుల కోసం.. కాళ్లు పట్టుకున్న రైతులు..
    Farmers Protest: కౌలు చెక్కులు ఇవ్వాలంటూ అమరావతి రైతులు తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. 6 నెలలుగా అసైన్డ్ కౌలు చెక్కులు ఇవ్వట్లేదని రైతులు వాపోయారు. కౌలు చెక్కులు ఇవ్వాలంటూ అమరావతి ఎస్సీ రైతులు సీఆర్డీఏ అధికారుల కాళ్లపై పడి వేడుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Minor Lovers Suicide: పెద్దలు ఒప్పుకోలేదని.. చెరువులో దూకి మైనర్ ప్రేమజంట ఆత్మహత్య
    Minor Lovers Suicide: చిన్న వయసులోనే ఆకర్షణను ప్రేమగా భావించడం.. ఆ విషయం ఇంట్లో వారికి ఎక్కడ తెలుస్తుందోనన్న భయం ఒకవైపు.. తెలిస్తే పెళ్లికి ఒప్పుకుంటారో లేదో.. అనే ఆలోచనలతో ప్రాణాలు తీసుకునేందుకూ నేటి పిల్లలు వెనకాడటంలేదు. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఓ మైనర్ జంట ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో.. వాళ్లని పెద్దలు మందలించారు. దాంతో మనస్తాపానికి గురైన ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రేపు తెలంగాణకు.. అక్కడి నుంచి ఆంధ్రకు.. మోదీ ఫుల్ షెడ్యూల్ ఇలా..
    Modi Hyderabad Tour Schedule: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. రేపు మధ్యాహ్నం నగరానికి చేరుకోనున్న మోదీ... సాయంత్రం భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్నారు. రెండ్రోజులపాటు నోవాటెల్‌ హోటల్‌లో బస చేసే అవకాశం ఉంది. మరోవైపు ప్రధాని పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 10 వేల మంది విధులు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ట్రాక్టర్లతో 'టగ్​ ఆఫ్​ వార్'​.. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు.. వీడియో వైరల్​!
    Tractor Rope Jogging: మామూలుగా టగ్​ ఆఫ్​ వార్​ అంటే.. అటు కొందరు ఇటు కొందరు తాడును తమవైపుకు లాక్కుంటూ పోటీ పడుతుంటారు. కానీ కర్ణాటక బెళగావిలో ట్రాక్టర్లతో టగ్​ ఆఫ్​ వార్​ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అమిత్​ షాను అప్పుడే అడిగా.. ఆయన ఓకే చెప్పి ఉంటే ఇలా అయ్యేదా?'
    Maharashtra politics crisis: మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ పతనం, ఏక్​నాథ్​ శిందే సారథ్యంలో కొత్త సర్కార్ ఏర్పాటు నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే. రెండున్నరేళ్లపాటు శివసేన నేతను సీఎంను చేయాలన్న తన ప్రతిపాదనకు అమిత్ షా అప్పట్లో అంగీకరించి ఉంటే ఇప్పుడు ఇదంతా జరిగేదా అని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉక్రెయిన్​పై రష్యా క్షిపణి దాడి- 18 మంది బలి
    Russian Ukraine missile attack: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్ బలగాలతో పాటు సామాన్య పౌరులు సైతం మృత్యువాత పడుతున్నారు. తాజాగా తీర ప్రాంత నగరం ఒడెసాలోని తొమ్మిది అంతస్తుల నివాస భవనంపై రష్యా క్షిపణిని ప్రయోగించింది. ఈ దాడిలో 18మంది ప్రాణాలు కోల్పోగా 30మంది గాయపడినట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'జూన్​లో జీఎస్​టీ వసూళ్లు 56% జంప్​.. ఎగుమతి పన్ను అందుకే!'
    GST collections: జీఎస్​టీ వసూళ్లు జూన్​లో రూ. 1.44 లక్షల కోట్లుగా నమోదైనట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. రూపాయి విలువ పతనం అవుతున్న తరుణంలో.. ఈ పరిస్థితుల్ని ప్రభుత్వం, రిజర్వ్​ బ్యాంకు నిశితంగా పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నాపై ఆ ఒత్తిడి లేదు.. దాని గురించి ఆలోచిస్తే అంతే: నీరజ్ చోప్రా
    ఈ ఏడాది 90 మీటర్ల లక్ష్యాన్ని అందుకుంటాననే ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు భారత జావెలిన్ త్రోయర్​.. నీరజ్ చోప్రా. ప్రపంచ ఛాంపియన్​షిప్స్​ కోసం సన్నద్ధమవుతున్న అతడు.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడతానని చెప్పాడు. ఇటీవలే డైమండ్​ లీగ్​లో తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎలా చేయాలో అమ్మే నేర్పింది.. ఆ ఒక్కటీ రెండూ తప్ప: నటి అస్మిత
    'పద్మవ్యూహం' సీరియల్​తో అరంగేట్రం చేసి.. 'తూర్పు పడమర', 'మనసు మమత', 'శ్రావణ సమీరాలు', 'మధుమాసం' వంటి సీరియల్స్​తో బుల్లితెరపై ఎంతో పేరుతెచ్చుకున్న నటి అస్మిత. 'మురారి', 'అతిథి' వంటి చిత్రాల్లోనూ నటించారామె. తాజాగా అస్మిత తనకు ఇష్టమైన ఆహారం ఏంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details