ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Jun 21, 2022, 5:06 PM IST

Updated : Jun 21, 2022, 5:14 PM IST

..

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM

  • విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా.. ఆయనే ఎందుకు?
    Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ మాజీ నేత యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశంలో ఈమేరకు ఏకాభిప్రాయం కుదిరింది. అనంతరం కాంగ్రెస్ నేత జైరాం రమేశ్.. యశ్వంత్ సిన్హానే తమ ఉమ్మడి అభ్యర్థి అని అధికారికంగా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రహదారుల మరమ్మతుల వేగవంతానికి సీఎం జగన్ ఆదేశం: మంత్రి సురేశ్
    CM Review on Roads: రోడ్ల మరమ్మతులు, బ్రిడ్జిలు, ఆర్​వోబీల నిర్మాణాలను వచ్చే నెల 15 లోపు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఆర్​అండ్​బీ, పంచాయతీరాజ్, పురపాలక శాఖల పరిధిలో రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపై సీఎం సమీక్షించినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'రాష్ట్ర ప్రభుత్వం రూ.7,660 కోట్ల పంచాయతీ నిధులను దొంగిలించింది'
    రూ. 7,660కోట్ల పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిందని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్‌ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచులకు ఇవ్వకుండా దారి మళ్లించిందని పేర్కొంటూ.. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్​కు లేఖ రాశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆన్​లైన్ ద్వారా ఎండాడలో ఓపెన్ ప్లాట్లు విక్రయం.. జీవోపై హైకోర్టు స్టే
    HC stay on Endada Plots Sale: విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలో ఓపెన్ ప్లాట్లను ఆన్​లైన్ ద్వారా విక్రయించేందుకు ఏపీ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన వేలం ప్రకటనపై హైకోర్టు స్టే విధించింది. తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వేసిన పిల్​పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్రంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
    Yoga Day Celebrations: రాష్ట్రంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాజ్​భవన్​లో గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​, హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాతోపాటు న్యాయమూర్తులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అంబేడ్కర్ స్థానంలో సీఎం జగన్ ఫొటో.. భగ్గుమన్న గ్రామస్థులు
    Villagers fire on officers: కృష్ణా జిల్లా రామనపూడి సచివాలయం వద్ద గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. సచివాలయంలో అంబేడ్కర్ చిత్రపటాన్ని తీసివేసి ఆ స్థానంలో ముఖ్యమంత్రి జగన్ ఫొటో ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు. గ్రామస్థుల ఆందోళనకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గేమ్​ పేరిట బాలుడికి వల.. అమ్మనాన్నల ఫోన్లు హ్యాక్.. ఆ ఫొటోలు తీయించి...
    సైబర్​ హ్యాకర్ల ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా జైపుర్​లో 13 ఏళ్ల బాలుడిని ట్రాప్ చేసిన హ్యాకర్​.. అతనితో అసభ్యకర పనులు చేయించాడు. ఇంతకీ ఆ చిన్నారి సైబర్​ ఉచ్చులో ఎలా చిక్కుకున్నాడు? ఆ తర్వాత ఏమైంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రూ.10 నాణేలతో కారు కొనుగోలు- ఆ న్యూస్ ఫేక్​ అని చెప్పేందుకేనట!
    "రూ.10 నాణేల చెల్లవు"... ఇదేదో కేేంద్ర ప్రభుత్వమో, రిజర్వ్​ బ్యాంకో ఇచ్చిన స్టేట్​మెంట్ కాదు. తమిళనాడులోని ధర్మపురి వాసులు పుట్టించిన పుకారు ఇది. ఈ వదంతును పోగొట్టడానికి ఓ వ్యక్తి పెద్ద యుద్ధమే చేశాడు. చివరకు ఓ వినూత్న ప్రయోగంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బంగారం ధర మరింత పెరుగుతుందా? ఇప్పుడు కొంటే లాభమేనా?
    దేశంలో 10 గ్రాముల బంగారం ధర జూన్​లో రూ. 51 వేలపైకి చేరింది. జనవరిలో ఇది రూ. 48 వేలుగా ఉంది. అంటే దాదాపు రూ.3000 పెరిగింది. 6 నెలల్లోనే 6.5 శాతం లాభపడిందన్నమాట. ద్రవ్యోల్బణం భయాలు, స్టాక్​ మార్కెట్ల పతనం నేపథ్యంలో.. బంగారం ధర ఎలా ఉండొచ్చు. ఇంకా పెరుగుతుందా? తగ్గే అవకాశాలున్నాయా?పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ''ప్రిన్స్'​ పోస్ట్​పోన్ కాదు.. రిలీజ్ ఆలస్యమంతే' ​.. ఓటీటీలో 'విక్రమ్​' ఎప్పుడంటే?
    కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. అనుదీప్ కేవీ దర్శకత్వంలో శివకార్తికేయన్​ నటిస్తున్న 'ప్రిన్స్', కమల్​ హాసన్​ 'విక్రమ్', అజయ్ దేవ్​గణ్​ 'దృశ్యం 2' సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
Last Updated :Jun 21, 2022, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details