ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గతంలో ఎన్నికల అధికారి ప్రసంగం - రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తున్న వైసీపీ నేతలు - YSRCP violates election code

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 9:55 AM IST

YSRCP Kurasala Kannababu Violates Election Code: ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైసీపీ నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైసీపీ ప్రచారానికి తెగ వాడేస్తున్నారు. నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు అధికారిక కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్‌ కృతికాశుక్లా గతంలో పాల్గొన్నారు. అందులో ప్రభుత్వం వేల మందికి పట్టాలిచ్చిందని చెబుతూ పథకాలను ప్రజలకు వివరించారు. 

రికార్డు చేసిన ఆ వీడియో ప్రసంగాన్ని ఎన్నికల ప్రచార రథంలో ప్రస్తుతం కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో ప్రదర్శిసున్నారు. సాక్షాత్తూ జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగం వినిపిస్తూ, వైసీపీకి ఓటేయాలని కోరుతూ ఫ్యాను గుర్తు, సీఎం జగన్‌, వైసీపీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులు కన్నబాబు, చలమలశెట్టి సునీల్‌ చిత్రాలతో ప్రదర్శిస్తుండడంపై జనం ముక్కున వేలేసుకుంటున్నారు. కరప మండలం నడకుదురు గ్రామంలో ఈ అతిక్రమణ దృశాలు కనిపించాయి.

ABOUT THE AUTHOR

...view details