ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖలో ఉబర్‌ డ్రైవర్ల సమ్మె- ఇష్టారాజ్యంగా కమీషన్​ తీసుకుంటున్న యాజమాన్యం - Uber Drivers Protest

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 7:21 PM IST

uber_drivers

Uber Drivers Protest in Visakha District : తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉబర్​ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంలో శనివారం సీపీఎం​ కార్యాలయంలో ఉబర్​ డ్రైవర్ల బంద్​ అంశంపై రౌండ్​​ టేబుల్​ సమావేశం నిర్వహించారు. ఉబర్​ డ్రైవర్లు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, తమ న్యాయపరమైన డిమాండ్లను అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Solve Uber Drivers Problems : లక్షలు వెచ్చించి కారును కొనుగోలు చేస్తే ఉబర్​ యాజమాన్యం ఏ రోజుకు ఎంత రేటు చెల్లింస్తుందో అర్థం కావడం లేదని డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు బి.జగన్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఉబర్​ యాజమాన్యం కమీషన్​ కూడా ఇష్టారాజ్యంగా తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రజా సంఘాలన్నీ ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details