ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజ్యసభకు పోటీ చేయాలా ? వద్దా ? - చంద్రబాబు కసరత్తు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 7:27 PM IST

tdp_rajyasabha_candidate

TDP Rajyasabha Candidate: రాజ్యసభ ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేయాలా ? వద్దా ? అనే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్నారు. రాష్ట్రంలోని 3 రాజ్యసభ స్థానాలకు ఈనెల 15తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. అభ్యర్థిని నిలబెడితే మద్దతిస్తామంటూ తెలుగుదేశం నేతలతో వైఎస్సార్​సీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు సంప్రదింపులు చేస్తున్నారు. తమ అసంతృప్తుల జాబితా సుమారు 70మంది వరకూ ఉన్నట్లు ఆ ఎమ్మెల్యేలు వివరాలు అందించినట్లు సమాచారం. గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో టీడీపీ ఎమ్మెల్యేల బలం 22కు చేరటంతో రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం గంటా న్యాయపోరాటం చేస్తున్నారు. 

ఒక రాజ్యసభ అభ్యర్థి గెలుపు కోసం సుమారు 44 మంది ఎమ్మెల్యేల మొదటి ప్రాధాన్యం ఓట్ల అవసరం ఉంది. ఈ నెల 27న రాజ్యసభ ఖాళీలకు పోలింగ్ జరగనుంది. వైఎస్సార్​సీపీ మూడు స్థానాలకు ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించగా, ఆపార్టీ తరుపున వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ రెడ్డి, గొల్ల బాబూరావు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్​సీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో ఆ పార్టీ నిమగ్నమై ఉంది. 

ABOUT THE AUTHOR

...view details