ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE: చంద్రబాబుపై సీఐడీ కేసు ఫైల్స్ దగ్ధం- టీడీపీ నేత పట్టాభి రామ్ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - SIT Papers burnt

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 3:31 PM IST

Updated : Apr 8, 2024, 3:36 PM IST

TDP Leader Pattabhi Ram Media Conference:గుంటూరు జిల్లా తాడేపల్లి సిట్‌ కార్యాలయం ఆవరణలో పెద్దమొత్తంలో వివిధ పత్రాలను బూడిద చేయడం వివాదాస్పదమవుతోంది. హెరిటేజ్ సంస్థకి సంబంధించి పలు కీలక పత్రాలతో సహా ఇతర కీలక డాక్యుమెంట్స్ తగలబెట్టారని తెలుగుదేశం ఆరోపణలు చేస్తోంది. సీఐడీ(CID) చీఫ్‌ రఘురామ్‌రెడ్డి వ్యక్తిగత సిబ్బందే నేరుగా పత్రాలు తెచ్చి తగలబెట్టారని చెబుతోంది. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు గతంలో సిట్ అనేక అక్రమ కేసులు బనాయించిందని తెలుగుదేశం నేతలు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబుకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని అనేక మందిపై సీఐడీ ఒత్తిడి చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎలాంటి అనుమతులు లేకుండా హెరిటేజ్ సంస్థ, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఐటి రిటర్న్స్, ఇతర కీలక డాక్యుమెంట్స్‌ను దొడ్డి దారిన సంపాదించారని గతంలో లోకేశ్​ ఆరోపణలు చేశారు. అవే డాక్యుమెంట్స్ చూపించి ఓ కేసులో లోకేశ్​ను సీఐడీ ప్రశ్నించింది. కేసుతో సంబంధంలేని వారి వ్యక్తిగత పత్రాలు సీఐడీ చేతికి ఎలా వచ్చాయని ఆ రోజే అధికారులను లోకేశ్ నిలదీశారు. తాజాగా ఈ ఘటనపై టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం. 
Last Updated : Apr 8, 2024, 3:36 PM IST

ABOUT THE AUTHOR

...view details