ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బడుగులను గుమ్మం బయటే నుంచో బెట్టడమేనా జగన్ చేసే సామాజిక న్యాయం: నారా లోకేశ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 10:10 PM IST

Nara_Lokesh_Criticised_to_Jagan

Nara Lokesh Criticised to Jagan : జగన్ ఓ దళిత ద్రోహి అంటూ టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఓ విడియోని సామాజిక మాధ్యమం ఎక్స్​లో పోస్టు చేశారు. బడుగులను గుమ్మం బయటే నుంచో బెట్టడమేనా జగన్ చేసే సామాజిక న్యాయం అంటూ నిలదీశారు. సామాజిక రాజకీయం కాకుండా, సామాజిక న్యాయం చేయాలని లోకేశ్ హితవుపలికారు. బడుగులను బానిసత్వంలో భాగస్వాములను చేయడం వైసీపీ తీరని, అదే బడుగులను పరిపాలనలో భాగస్వాములను చేయడం తెలుగుదేశం పార్టీ తీరని స్పష్టం చేశారు. 

అయితే సీఎం జగన్ నేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. మెుత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను జగన్ సమక్షంలో ఆ పార్టీ నేతలు వెల్లడించారు. వైసీపీ అభ్యర్థుల జాబితాపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం జగన్‌ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా మునిగిపోయే నావలో ప్రయాణికుల జాబితా లాంటిదంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్‌' లో మరో పోస్టు చేశారు. ఈ దెబ్బతో ఇక జగన్‌ పనైపోయిందని లోకేశ్ విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details