ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుక్కెడు తాగునీరు అందించలేరా ? - మెడలో బిందెలు, చేతిలో ప్లకార్డుతో ఒంటికాలిపై నిల్చొని వ్యక్తి నిరసన - PROTEST FOR WATER IN URAVAKONDA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 12:50 PM IST

protest_for_water_in_anantapur_district.

Protest For Water in Anantapur District : అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో తాగునీటి కొరత అధికంగా ఉందని స్థానిక బాధితుడు శివ అనే వ్యక్తి ఒంటికాలుపై నిల్చుని వినూత్నంగా నిరసన తెలిపారు. నెల రోజులుగా ఉరవకొండలోని 11వ వార్డుకు తాగునీటి సరఫరా నిలిచిపోయిందని యువకుడు ఆందోళ వ్యక్తం చేశాడు. ఆర్‌డబ్ల్యూఎస్‌ (RWD) అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని అగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు సమస్య విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం ఎదుట మెడలో ఖాళీ బిందెలు వేసుకుని ఒంటికాలుపై నిల్చుని  ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపారు. 

Water Scarcity in Uravakonda : తాగునీటి సమస్యపై అధికారులు స్పందించాలని కోరారు. నీళ్ల పైప్​లను అక్రమంగా మళ్లించుకుంటున్నారని అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. అసలే ఎండలు మండిపోతుంటే గుక్కెడు తాగునీరు అందించలేరా అని ప్రశ్నించారు. నెల రోజులుగా తాగు నీటి సరఫరా నిలిపితే పిల్లలు, వృద్దుల పరిస్థితి ఏంటని ఆవేదన చెందారు.

ABOUT THE AUTHOR

...view details