ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బీ కేర్​ఫుల్​ విత్​ వైఎస్సార్సీపీ - ఓటుతో వాళ్లకు బుద్ది చెప్పాలి: నాగబాబు - Nagababu Comments on YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 5:44 PM IST

బీ కేర్​ఫుల్​ విత్​ వైఎస్సార్సీపీ - ఓటుతో వాళ్లకు బుద్ది చెప్పాలి: నాగబాబు (ETV Bharat)

Jana Sena Party  General Secretary Konidela Nagababu Comments on YSRCP : ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా నాశనమైందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు ఆరోపించారు. జగన్‌ సర్కారు విధానాల వల్ల కియా, అమరరాజా వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయన్నారు. ఎన్నికల్లో జగన్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Nagababu Fi on YSRCP Government : రాష్ట్రం ఇప్పటికే 75 శాతం నాశనమైపోయింది వైఎస్సార్సీపీకి ఇంకో అవకాశం ఇస్తే కోలుకోలేనంత దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్​లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని, రైతులకు మద్ధతు లేదని వాపోయారు. జరగబోయే ఎన్నికల్లో ప్రజలంతా కలసికట్టుగా మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమర్థవంతమైన నాయకుడ్ని ఎన్నుకోవాలని తెలిపారు. ఎన్డీయే కూటమి అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు వైఎస్సార్సీపీతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details