ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైఎస్సార్సీపీ అరాచక పాలనను అంతమొందించాలి: ఆనం రామనారాయణరెడ్డి - ANAM RAMANARAYA ON YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 11:50 AM IST

alliance_candidate_anam_ramanaraya_reddy_in_prajagalam_public_meeting

Alliance Candidate Anam Ramanaraya Reddy in Prajagalam Public Meeting : రాష్ట్రంలో  వైఎస్సార్సీపీ సాగిస్తున్న అరాచక పాలనను అంతమొందించాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మర్రిపాడులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తో కలిసి ర్యాలీగా వెళ్లారు. రోడ్‌షో ప్రదర్శనగా వెళ్తున్న వారికి ప్రజలు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. కోలాటాలతో మహిళలు ఘనస్వాగతం పలికారు.  

ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి తమను గెలిపిస్తే ఆత్మకూరును అభివృద్ది వైపు ఉరకలెత్తిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు 3,600  కోట్ల రూపాయలతో ఆత్మకూరును అభివృద్ధి చేశానని, మర్రిపాడు ప్రజల దాహార్తిని తీర్చేందుకు సోమశిల జలాశయం ద్వారా 13 వందల కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించానని తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details