ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అధికార పార్టీలో అసమ్మతి రాగం- అధికారులు తమ గోడు వినడం లేదంటూ రోడ్డెక్కిన ఓ వర్గం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 4:56 PM IST

YSRCP leaders Concern over irregularities in assignment lands: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన బాటపట్టారు. అసైన్మెంట్ భూముల్లో రైతులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్సీపీ నేతలు రోడ్డెక్కారు. స్థానిక వైఎస్సార్సీపీ పెద్దలు, అధికారులు తమ గోడు వినడం లేదని, రైతులతో కలిసి అన్నమయ్య విగ్రహానికి వినతి పత్రం సమర్పించి, తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

YSRCP leaders Concern over irregularities in assignment lands
YSRCP leaders Concern over irregularities in assignment lands

అధికార పార్టీలో అసమ్మతి రాగం- అధికారులు తమ గోడు వినడం లేదంటూ రోడ్డెక్కిన ఓ వర్గం

YSRCP leaders Concern over irregularities in assignment lands:అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. అసైన్మెంట్ భూముల్లో తమకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్సీపీ నాయకులు రోడ్డెక్కారు. స్థానిక వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు తమ గోడు వినడం లేదని అన్నమయ్య విగ్రహానికి వినతి పత్రం సమర్పించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. కోర్టు కేసులను వెనక్కి తీసుకుంటే, తమ అధీనంలో ఉన్న భూములను అసైన్మెంట్ కమిటీ ద్వారా రెగ్యులరైజ్ చేస్తామని నందలూరు పనిచేసిన ఎమ్మార్వో సత్యానందం హామీ ఇచ్చారని వైఎస్సార్సీపీ వర్గీయులు తెలిపారు.

అర్హులకు న్యాయం చేయాలి: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో రైతుల భూములను అసైన్మెంట్ కమిటీలో ఆమోదించకుండా అధికారులు మోసం చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. నిరుపేదలైన రైతులకు అసైన్మెంట్ కమిటీ ద్వారా భూములు కేటాయించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు అధికారుల తీరుపై మండిపడ్డారు. అసైన్మెంట్ కమిటీలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేదలైన రైతులకు అసైన్మెంట్ కమిటీ (Assignment Committee) ద్వారా భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున గడపగడపకు వెళ్లి ప్రచారం చేయలేమని పేర్కొన్నారు. అసైన్మెంట్ భూముల అంశంలో అధికారులు ఒక వర్గం వారికిమాత్రమే కొమ్ముకాస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు బహిరంగంగా విమర్శించారు.
మోసం చేసిన సీఎం జగన్​కు బుద్ధి చెప్తాం - నిరుద్యోగుల హెచ్చరిక

వేల మంది రైతులకు అన్యాయం:నియోజకవర్గంలోని అసైన్డ్ భూముల (Assigned lands) సమస్యలను గతంలోనే సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సీఎం జగన్ వెంటనే స్పందించి అసైన్మెంట్ కమిటీలో రైతుల పేర్లు చేర్చాలని అప్పట్లో అధికారులకు ఆదేశాలు ఇచ్చారని, ఇప్పటికీ ఏడు నెలలు కావస్తున్నా ఆ దిశగా చర్యలు జరగడం లేదని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. అధికారుల అలసత్వం వల్ల వేల మంది రైతులు నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. అసైన్మెంట్ కమిటీలో మెుదటి, రెడో విడతల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా చేస్తే రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఊర్లకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితులు ఉండవని తెలిపారు. ప్రతి రైతుకు న్యాయం చేసే విధంగా నాయకులు, అధికారులు ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
సజ్జల కుటుంబానికి డబుల్ ఓట్లు - ఓటర్ల జాబితాలో పారదర్శకతకు తూట్లు

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు: రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలం వైయస్ఆర్సీపీ కన్వీనర్ లేబాకా నాగేంద్ర, లేబాక సర్పంచ్ నరసయ్య, స్టేట్ ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీ నరసయ్య, సుండుపల్లి వైఎస్సార్సీపీ నాయకులు శివారెడ్డి, బలరామరాజు, రాజంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పోలి మురళి తదితరులతో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ సర్పంచులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.
జగనన్న ముద్దు - నారాయణస్వామి వద్దే వద్దు!

ABOUT THE AUTHOR

...view details