ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుమల టైం స్లాట్​ టోకెన్ల జారీలో ప్రైవేట్ వాహన డ్రైవర్ల మోసాలు- భక్తులకు తీవ్ర ఇక్కట్లు! - Tirumala Time Slot Tokens Issue

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 24, 2024, 5:20 PM IST

Tirumala Time Slot Tokens Issue in Tirupati District : శ్రీవారిమెట్టు మొదట్లోనే టోకెన్లు జారీ చేస్తుండడంతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు అడ్డదారులతో తమను ఇబ్బంది పెడుతున్నారని భక్తులు వాపోతున్నారు. టీటీడీ ఇలాంటి మోసాలను అరికట్టాలని భక్తులు డిమాండ్​ చేస్తున్నారు. గతంలో మాదిరిగా టోకెన్ల జారీ చేపట్టాలని వారు సూచిస్తున్నారు.

tirumala_ticket_issue
tirumala_ticket_issue

Tirumala Time Slot Tokens Issue in Tirupati District :తిరుమలకు వెళ్లేందుకు శ్రీవారి మెట్టుమార్గంలో టైం స్లాట్‌ టోకెన్ల జారీలో టాక్సీ, ఆటో డ్రైవర్లు అవినీతికి పాల్పడుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లతో పాటు తిరుమలలో దింపుతామని ఒక్కొక్కరి నుంచి 500 నుంచి 2 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. శ్రీవారిమెట్టు మొదట్లోనే టోకెన్లు జారీ చేస్తుండడంతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు అడ్డదారులు తొక్కుతున్నారు.

ఆలయంలో వైసీపీ ఎన్నికల ప్రచారం- మండిపడుతున్న భక్తులు - YCP Election Campaign

బస్టాండ్​, రైల్యేస్టేషన్​లలో భక్తులను ఎక్కించుకుని శ్రీనివాస మంగాపురం మార్గంలో ఉన్న శ్రీవారి మెట్టు దగ్గర టైమ్​ స్లాట్​ టోకెన్లు తీసుకుని ట్యాక్సీలలో తిరుమలకు చేరవేస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు టైమ్​ స్లాట్​ టోకెన్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టి టైం స్లాట్ టోకెన్‌ కౌంటర్లు పెంచాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు. గంటల తరబడి వేచి ఉన్నా టికెట్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీవారి సేవలో నారా కుటుంబం - మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడిని పరామర్శించిన లోకేష్‌ దంపతులు - Nara Lokesh Family Visit Tirumala

తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్ని రకాలుగా ఆదాయ వనరులు వస్తున్న మౌలిక వసతులు కల్పించడంలో విఫలం అయ్యిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి మెట్లు ద్వారా తిరుమలకు వెళ్లే భక్తులకు టైమ్​ స్లాట్​ టోకెన్లును జారీ చేయడంలో సమస్యలు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం జారీ చేసే టికెట్లు కౌంటర్​ వద్ద ఎలాంటి క్యూలైన్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్​ సందీప్​ మెహతా, నటుడు గోపిచంద్​

కరోనా రాక ముందు 1200వ మెట్లు వద్ద టోకెన్లు జారీ చేసేవారని, అప్పుడు ఎలాంటి సమస్య లేకుండా భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లేవారని పేర్కొన్నారు. కరోనా అనంతరం శ్రీవారి మెట్లు మొదట్లోనే జారీ చేసున్నాడం వల్ల ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు అడ్డదారులు తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి మెట్లు వద్ద టైమ్​ స్లాట్​ టోకెన్లు ఇవ్వడం వల్ల కాలి నడకన వెళ్లే వారు, వాహనాల ద్వారా తిరుమల వెళ్లే వారికి తేడా లేకుండా పొందుతుందని పేర్కొన్నారు.

తిరుమల టైం స్లాట్​ టోకెన్ల జారీలో సమస్యలు - అడ్డదారులు తొక్కుతున్నా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు

ABOUT THE AUTHOR

...view details