ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం- తెలుగు విద్యార్థి దుర్మరణం - Telugu Student Dead in America

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 12:23 PM IST

Telugu Student Dead in America Road Accident: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి దుర్మరణం చెందాడు. పై చదువుల కోసం వెళ్లిన కుమారుడు మృతిచెందటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

Telugu_Student_Dead_in_America_Road_Accident
Telugu_Student_Dead_in_America_Road_Accident

Telugu Student Dead in America Road Accident: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతిచెందాడు. స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో అకస్మాత్తుగా వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. ఒక్కసారిగా పొగమంచు కమ్ముకోవటంతో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి చెందగా ముగ్గురు యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం:బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్(22) బీటెక్ పూర్తి చేసుకుని ఉన్నత విద్య కోసం గతేడాది డిసెంబరు చివరిలో అమెరికా వెళ్లాడు. మాడిసన్‌ ప్రాంతంలోని డకోట స్టేట్‌ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుకుంటున్నాడు. భారత కాలమానం ప్రకారం స్నేహితులతో కలిసి రేవంత్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యేందుకు కారులో వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కుమారుడి మరణ వార్తతో ఆ కుటుంబంతో పాటు బోడవాడలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. రేవంత్ తల్లి కొన్నాళ్ల క్రితం మరణించగా, అతడి తండ్రి ఆచంట రఘుబాబు ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నారు.

కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా - 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం - Auto overturned 25 Injured

కాగా అమెరికా రోడ్డు ప్రమాదాల్లో భారతీయులు చనిపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే పోర్టుల్యాండ్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొణకంచి గ్రామానికి చెందిన కమతం నరేష్ ఆయన భార్య గీతాంజలి అమెరికాలో ఉంటున్నారు. వారికి ఒక కుమార్తె హానిక(6), ఒక కుమారుడు(3) ఉన్నాడు. కుమార్తె గీతాంజలి పుట్టినరోజు సందర్భంగా తెల్లవారుజామునే గుడికి వెళ్లారు.

అనంతరం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వారి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే కుమార్తె హానిక మృతి చెందింది. తీవ్ర గాయాలపాలైన గీతాంజలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. భర్త నరేష్, కుమారుడు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాగా కుమార్తె పుట్టినరోజు నాడే తల్లీకూతుళ్లిద్దరూ మృతిచెందటంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భాంతికి గురైంది.

పెళ్లింట విషాదం - కారు బోల్తా పడి పెళ్లి కుమార్తె తల్లి సహా ముగ్గురు మృతి - ROAD ACCIDENTS

ABOUT THE AUTHOR

...view details