ఆంధ్రప్రదేశ్

andhra pradesh

SRH VS RCB ఐపీల్ మ్యాచ్​ టికెట్లు - ఆ లింక్ క్లిక్​ చేస్తే డబ్బులు మాయం - SRH Vs Rcb Fake Tickets

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 2:16 PM IST

SRH vs RCB Fake Tickets Cyber Crime : ఇవాళ జరగబోయే ఎస్​ఆర్​హెచ్​ వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ డిమాండ్​ను అలుసుగా చేసుకుని కొంతమంది సైబర్​ నేరగాళ్లు ఫేక్​ టికెట్లకు తెర లేపారు. ఇన్‌స్టాగ్రామ్‌​ను బేస్​ చేసుకుని నకిలీ లింకులను, స్టోరీలను క్రియేట్ చేసి డబ్బులు దోచుకోవడానికి ప్లాన్​ చేశారు. ఇలాంటి వాటిపై అందరూ జాగ్రత్త వహించాలని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్​ సూచించారు. ఫేక్​ టికెట్లకు సంబంధించి అలర్ట్​ చేస్తూ ట్వీట్ పెట్టారు.

Fake Ticket Alert For SRH vs RCB IPL Match
Fake Ticket Alert For SRH vs RCB IPL Match

Fake Ticket Alert For SRH vs RCB IPL Match :ఐపీఎల్ వచ్చిందంటే చాలు నా టీమ్​ అంటూ నెటిజన్లు వాళ్ల అభిమాన జట్లకు సపోర్ట్​ చేస్తుంటారు. అలా ప్రతీ ఐపీఎల్​ టీమ్​కు ఫ్యాన్​ బేస్​ ఉంటుంది. అలా ఎక్కువ మంది ఫ్యాన్స్​ ఉండే టీమ్​ మ్యాచ్​లు జరుగుతుంటే మాత్రం అభిమానులు ఆ ఆటను వార్​లాగా ఊహించుకుంటారు. అలాంటి మ్యాచ్​లలో బెంగళూరు వర్సెస్​ హైదరాబాద్​కు మాంచి డిమాండ్​ ఉంది. ఎలాగైనా ఆ మ్యాచ్​ను లైవ్​లో చూడాలని టికెట్ల కోసం తెగ ట్రై చేస్తుంటారు క్రికెట్ ఫ్యాన్స్. దీన్నే అలుసుగా తీసుకుంటున్నారు సైబర్​ నేరగాళ్లు.

VC Sajjanar Tweet on Fake Tickets :ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఎస్​ఆర్​హెచ్​ వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ టికెట్లు అందుబాటులో ఉన్నాయని నకిలీ లింకులను పంపిస్తున్నారు. మ్యాచ్ టికెట్లకు సంబంధింది నకిలీ రీళ్లు, స్టోరీలు ఇన్‌స్టాగ్రామ్‌​లో చక్కరులు కొడుతున్నాయి. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్​ ట్వీట్​ చేశారు. పొరపాటున వాటిని నమ్మి లింక్స్​ ఓపేన్​ చేసినా, వాటి ద్వారా టికెట్​ కొనుగోలు చేసినా ఖాతాలోని డబ్బు గల్లంతవుతుందని హెచ్చరించారు. వాటి లింక్ ఓపెన్ చేసి వ్యక్తిగత సమాచారాలు ఇవ్వకూడదని తెలిపారు. మ్యాచ్​​ టికెట్లు హెచ్​సీఏ పేటీఎంలో మాత్రమే అందుబాటులో ఉంచింది.

కమిన్స్ నోట తెలుగు మాట - స్టార్ హీరోల డైలాగ్స్​ చెప్పి అదరగొడుతున్న స్టార్ క్రికెటర్ - IPL 2024

అనుమానాలు వ్యక్తం చేస్తున్న అభిమానులు : హైదరాబాద్​ ఉప్పల్​ స్టేడియంలో జరిగే ఎస్​ఆర్​హెచ్​ మ్యాచ్​ టికెట్​ విషయంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇటీవల జరిగిన రెండు మ్యాచ్​ల టికెట్ల్ దొరక్కపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కవ ధరలు గల టికెట్లు అందుబాటులో ఉంచడం లేదన్నారు. కాగా ఆర్సీబీ - ఎస్​ఆర్​హెచ్​ మ్యాచ్​కు సంబంధించి టికెట్లు విడుదల చేసిన నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడుపోవడంతో క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. దానికి సంబంధించిన వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. తాజాగా అదే మ్యాచ్​కు సంబంధించి ఇలా సోషల్​ మీడియాలో టికెట్లు ఉన్నాయంటూ స్టోరీలు, రీల్స్ వస్తుండడంతో అభిమానులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సన్​రైజర్స్ టీమ్​తో మహేశ్​ బాబు - ఫొటోలు చూశారా? - Mahesh Babu Sunrisers

చెన్నై సూపర్ కింగ్స్ - హైదరాబాద్ టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్​ సందర్భంగా కూడా చాలా తక్కువ టికెట్లు అందుబాటులో ఉంచినట్టు అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్లు ఆన్​లైన్​లో ఉంచిన ఐదు నిమిషాల్లోనే అయిపోయినట్టు ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నేళ్ల తర్వాత హైదరాబాద్​ గడ్డకు వచ్చిన ధోనీ ఆట చూడాలని సగటు క్రికెట్ అబిమానులు ఉప్పల్ స్టేడియం బాట పట్టారు. కానీ అతి కొద్ది మందికి మాత్రమే ఆన్​లైన్​లో టికెట్లు దక్కాయనే విమర్శలు వచ్చాయి.

Cong Leader Protest At Uppal Stadium :మరోవైపు ఐపీఎల్ టికెట్ల విక్రయాలలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ యువజన రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉప్పల్ స్టేడియం ముందు ఆందోళన చేపట్టారు. ఉప్పల్ క్రికెట్ మైదానంలో జరిగిన గత రెండు ఐపీఎల్ మ్యాచ్‌లకు టిక్కెట్లు లభించలేవని మండిపడ్డారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) నిర్వాహకులు, టికెటింగ్ ఏజెన్సీ పేటీఎం అమ్మకాలు, పంపిణీలో పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు.

RCBపై హెడ్ విధ్వంసం- 39 బంతుల్లోనే మెరుపు సెంచరీ - Travis Head IPL Century

ABOUT THE AUTHOR

...view details