తెలంగాణ

telangana

సమ్మక్క- సారలమ్మ ప్రసాదం భక్తుల దగ్గరకే - టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2024, 10:26 PM IST

Sammakka Saralamma Prasadam Online : భక్తుల ఇంటికే సమ్మక్క- సారలమ్మ ప్రసాదాన్ని అందించే టీఎస్ఆర్టీసీ సౌకర్యం బుధవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఈ సౌకర్యాన్ని ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో, పేటీఎం ఇన్ సైడర్ యాప్​లో ఆన్​లైన్​ ద్వారా పొందవచ్చు. ఈ నెల 14 నుంచి 25 వరకు ఆఫ్​లైన్​, ఆన్​లైన్​లో బుక్​ చేసుకున్న భక్తులను అమ్మవారి ప్రసారం అందిస్తామని టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ సూచించారు.

TSRTC Sammakka Saralamma Prasadam
Sammakka Saralamma Prasadam Online

Sammakka Saralamma Prasadam Online: తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం టీఎస్​ఆర్టీసీ అద్బుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క- సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే కార్యక్రమాన్ని చేపట్టింది. దేవాదాయ శాఖతో ఆర్టీసీ సంస్థ లాజిస్టిక్స్(TSRTC) విభాగం ఇందుకోసం ఒప్పందం కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవారి ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు సంస్థ అందజేయనుంది.

మేడారం జాతరలో ధరల మోత - లీటర్ వాటర్ బాటిల్ ఎంతో తెలిస్తే షాక్?

TSRTC Sammakka Saralamma Prasadam: మేడారం మహా జాతర(Medaram Jathara) ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నది. ఈనెల 14 నుంచి 25వ తేదీ వరకు ఆన్​లైన్, ఆఫ్​లైన్​లలో ప్రసాదాన్ని బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని టీఎస్​ఆర్టీసీ కల్పించింది. భక్తులు రూ.299 చెల్లించి సమీపంలోని ఆర్టీసీ లాజిస్టిక్స్ (కార్గో) కౌంటర్లలో, పీసీసీ ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్​ల వద్ద మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చు అని యాజమాన్యం సూచిస్తుంది. అమ్మవార్ల ప్రసాదం కావాల్సిన భక్తులు https:rb.gy/q5rj68 లింక్ పై క్లిక్ చేసి సిటీ పేరు సెలక్ట్​ చేసుకొని ప్రసాదాన్ని ఆర్డర్​ పెట్టుకోవచ్చు. లేదా పేటీఎం ఇన్ సైడర్ యాప్​లోనూ ప్రసాదాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు.

మేడారం ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్​ఆర్టీసీ బేస్ క్యాంప్స్ : ఎండీ సజ్జనార్

TSRTC Offer on Sammakka Saralamma Prasadam : బుకింగ్ చేసుకునే భక్తులకు ప్రసాదంతో పాటు అమ్మవార్ల పసుపు, కుంకుమను అందజేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు. ఈ బుకింగ్ కేవలం తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. బుక్ చేసుకున్న భక్తులకు మేడారం జాతర అనంతరం నేరుగా వారి ఇంటికే ప్రసాదాన్ని సంస్థ అందజేస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్ కౌంటర్లలో అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ సంస్థ తెలిపింది. మేడారం ప్రసాదం బుకింగ్​కు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్స్ కౌంటర్లను, ఆర్టీసీ కాల్ సెంటర్ 040-69440069, 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ యాజమాన్యం సూచించింది.

సమ్మక్క-సారక్కలకు ఆన్​లైన్​లో నిలువెత్తు బంగారం - కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్​

'మహాలక్ష్మి బిల్లులు నెలనెలా చెల్లిస్తాం - రాబోయే రోజుల్లో ఆర్టీసీకి మరో 1000 బస్సులు'

ABOUT THE AUTHOR

...view details