ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఓట్ల కోసం నేను మీ దగ్గరకు వస్తా, సమస్యలుంటే మీరు నా వద్దకు రావాలి' - ఎమ్మెల్యేపై గ్రామస్థుల ఆగ్రహం - People stop YCP MLA campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 7:22 PM IST

People Stop YCP MLA Campaign in Kakinada District : 'ఓట్లు కోసం అయితే నేనే మీ దగ్గరకు వస్తా, మీ సమస్యలు పరిష్కeరం కావలంటే మీరే నా వద్దకు రావాలి' ఇదీ ఓ వైఎస్సార్సీపీ శాసనసభ్యుడు ప్రజలకు ఇచ్చిన సమాధానం. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన గ్రామస్థులు ఆ ఎమ్మెల్యేని రోడ్డుపైనే నిలదీశారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు ఆ ప్రజాప్రతినిధి. అసలు ఎవరా ఎమ్మెల్యే, ఎందుకు ప్రజలు వారిని అడ్డుకున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.

People_Stop_YCP_MLA_Campaign_in_Kakinada_District
People_Stop_YCP_MLA_Campaign_in_Kakinada_District

People Stop YCP MLA Campaign in Kakinada District : 'ఓట్ల కోసం అయితే నేనే మీ దగ్గరకు వస్తా, మీ సమస్యలు పరిష్కారం కావలంటే మీరే నా వద్దకు రావాలి' ఇదీ ఓ వైఎస్సార్సీపీ శాసనసభ్యుని సమాధానం. ఆ మాట విన్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం చెందారు. ఇందుకేనా మీకు ఓట్లు వేసి గెలిపించింది అంటూ రోడ్డుపైనే నిలదీశారు. మా సమస్యలు పరిష్కరించమని గత 45 రోజులుగా దీక్ష చేస్తుంటే మీకు కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. అట్టాహాసంగా రెండు రోజుల క్రితమే ప్రచారం ప్రారంభించిన ఆ శాసనసభ్యునికి మూడోరోజే ప్రజల నుంచి నిరసనగళం వినిపించడంతో సమాధానం చెప్పలేక మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు.

'ఓట్ల కోసం నేను మీ దగ్గరకు వస్తా, సమస్యలుంటే మీరు నా వద్దకు రావాలి' - ఎమ్మెల్యేపై గ్రామస్థుల ఆగ్రహం

'ఎన్నికల హామీ ఎందుకు మర్చిపోయారు..?' వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. దాచినా దాగని వీడియో

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో ఉన్న కొన్ని భూములను కాకినాడ రూరల్ నియోజకవర్గం చెందిన వారికి పట్టాలుగా ఇచ్చేెందుకు స్థానిక వైసీపీ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్థానిక గ్రామస్థులు 46 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నారు. వారికి మద్దతుగా తెలుగుదేశం, జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సైతం సంఘీభావం తెలిపారు. అయితే అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.

People Angry With YCP MLA Ponnada : అయితే ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముమ్మిడివరం నియోజకవర్గనికి చెందిన వైసీపీ అభ్యర్ధి పొన్నాడ వెంకట సతీశ్ కుమార్ ప్రచారం ప్రారంభించారు. పొన్నాడ ప్రస్తుతం వైసీపీ తరపున రెండోసారి ఎన్నికల బరిలో నిలిచారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మూడోరోజైనా నేడు తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో ప్రచారానికి స్థానిక నాయకులతో కలిసి వచ్చారు. ఎమ్మెల్యే వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామస్థులు అతనిని గ్రామంలోకి రాకుండా అడ్డుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి - మా ఇళ్లను కాపాడండి! అన్నమయ్య జిల్లా గుంజన నది తీరం ప్రజలు

దీనిపై పొన్నాడ మాట్లాడుతూ, మీ సమస్య ఉంటే నా దగ్గరకు రావాలికాని, దీక్షలు చేస్తే పరిష్కారం అవుతుందా అని ప్రశ్నించారు. దీంతో గ్రామస్థులు మరింత రెచ్చిపోయి ఓట్లు అడగడానికైతే మీరు వస్తారు, మా సమస్యలు ఉంటే మీ దగ్గరికి రావాలా అని ఎదురు ప్రశ్నించారు. 46 రోజులుగా మేము చేస్తున్న పోరాటం మీడియాలో ప్రతిరోజు వస్తున్నా మీకు తెలియదా? అంటూ మహిళలు నిలదీశారు. దీంతో వారికి సమాధానం చెప్పలేక అక్కడనుండి మెల్లగా జారుకున్నారు.

గత ఐదేళ్లుగా గ్రామంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. వాటిని వీడియోలు, ఫోటోలు తీసి సంబంధిత అధికారులకు పెడుతుంటే ఎందుకు పెడుతున్నారు అంటూ తిరిగి మమ్మల్నే ప్రశ్నిస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్న మంచినీటి సమస్య తీర్చమంటే ఎన్నికల ముందు హడావిడిగా వాటర్ ట్యాంకర్ నిర్మించారు. కానీ కుళాయిల ద్వారా నీరు రావటం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైన స్పందించి తమ సమస్యను పరిష్కరించాలి. - చొల్లంగి గ్రామస్థులు

ఎమ్మెల్యే ఉష శ్రీచరణ్ ఎక్కడ ? సమస్యలు ఏనాడూ పట్టించుకోలేదని ప్రజలు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details