ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కర్ణాటకలో విషాదం - ఇద్దరు పిల్లలతో కలిసి మంటల్లో దూకి తల్లి ఆత్మహత్య - Three Were Burned Alive

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 1:47 PM IST

Updated : Mar 21, 2024, 3:32 PM IST

Mother Commits Suicide With Two Children in Karnataka: కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి మంటల్లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

mother_commits_suicide_with_two_children_in_karnataka
mother_commits_suicide_with_two_children_in_karnataka

Mother Commits Suicide With Two Children in Karnataka : చిన్న చిన్న కలహాలు పచ్చని కుటుంబాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలు జీవితాలకు శాపాలుగా మారుతున్నాయి. పరిష్కారం అయ్యే సమస్యలను భూతద్దంలో పెట్టి చూసి మరణాలకు స్వాగతం పలుకుతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన పిల్లలను చిన్న చిన్న గొడవలతో చేజేతులా హతమార్చి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా కుటుంబ కలహాల (Family Problems) నేపథ్యంలో తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన కర్ణాటకలోని చిల్లకర తాలూకాలో చోటు చేసుకుంది. మృతురాలు అనంతపురం జిల్లాకు చెందిన మహిళ.

కర్ణాటకలో విషాదం - ఇద్దరు పిల్లలతో కలిసి మంటల్లో దూకి తల్లి ఆత్మహత్య

అత్తింటి వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య

Anantapur Woman With Her Children Commit Suicide: స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం రంగచేడు గ్రామానికి చెందిన మారెక్కకు (24), కర్ణాటక చిల్లకర తాలుకాలోని మలసంద్రానికి చెందిన తిప్పేస్వామితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి భార్యా, భర్తలిద్దరూ వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. మారెక్క అత్త కోడలిని తరచూ సూటి పోటి మాటలతో ఇబ్బందులకు గురి చేసేదని మృతురాలి బంధువులు తెలిపారు. కరెంటు ఎక్కువ వృథా చేస్తున్నావని, డబ్బులు దుబారా ఖర్చు చేస్తున్నావంటూ మందలించేదని పేర్కొన్నారు. ఇటీవల మరోసారి అత్తా, కోడలు గొడవపడగా తీవ్ర మనస్థాపానికి గురైన మారెక్క తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య(Suicide) చేసుకుందని స్థానికులు తెలిపారు. అత్తింటి వేధింపులతోనే తమ కుమార్తె మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

అత్తింటి వేధింపులు తాళలేక గర్భిణీ ఆత్మహత్య

Harrasement Of Mother In Law: బుధవారం అత్తా, కోడలు ఇద్దరు మరోసారి గొడవపడగా మారెక్క తన ఇద్దరు పిల్లలు నయన్ (4), హర్షవర్ధన్ (2)తో కలిసి గ్రామ సమీపంలో కంపచెట్ల మధ్యకు వెళ్లింది. అక్కడ ముళ్ల కంపలు పోగేసి నిప్పంటించి మంటలు రేగాక పిల్లల్ని ఇద్దరిని తోసేసి తానూ మంటల్లో దూకింది. మంటల తీవ్రతకు ముగ్గురు సజీవ దహనమయ్యారు. క్షణికావేశంలో అత్త పోరు భరించలేక మారెక్క అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుందని గ్రామ ప్రజలు వాపోయారు. తమ కుమార్తె మృతికి అత్తింటి వేధింపులే కారణమని మారెక్క తల్లిదండ్రులు మారెన్న, చిత్తమ్మలు ఆరోపించారు. ఈ పరిణామంతో భర్త తిప్పేస్వామి కన్నీరు మున్నీరుగా విలపించారు.

అత్తింటి వేధింపులు.. బావిలో దూకిన అక్కాచెల్లెళ్లు.. ఇద్దరు చిన్నారులతో సహా..

ఇటీవల: తెలంగాణలో ముగ్గురు పిల్లలను చంపి అనంతరం తండ్రి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో నిరటిరవి(35) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పిల్లలను చంపి అనంతరం చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

Last Updated :Mar 21, 2024, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details