ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జైల్లో నిరాహార దీక్ష విరమించిన కోడికత్తి కేసు నిందితుడు శ్రీను

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2024, 5:20 PM IST

Kodi Kathi suspect Srinivas Hunger strike called off: గత వారం రోజులుగా విశాఖ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్న కోడికత్తి కేసు నిందితుడు శ్రీను దీక్ష విరమించాడు. జైల్లో పరిస్ధితుల దృష్ట్యా ఈరోజు నిరాహార దీక్ష విరమించానని కొడికత్తి శ్రీను చెప్పాడని దళితనేత బూసి వెంకటరావు వెల్లడించారు. విశాఖ కేంద్ర కారాగారంలో కోడికత్తి శీనును ములాఖత్​లో కలిసిన తర్వాత వివరాలను వెంకటరావు తెలిపారు. శ్రీను బాగా నీరసంగా ఉన్నాడని, మెరుగైన చికిత్స కోసం ప్రయివేటు అసుపత్రికి తరలించాలని వెంకటరావు డిమాండ్ చేశారు.

Etv Bharat
Etv Bharat

Kodi Kathi suspect Srinivas Hunger Strike Called off: సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ ఈనెల 18వ తేదీన నిరహార దీక్ష చేపట్టిన కోడికత్తి శ్రీను, నేడు తన దీక్ష విరమించారు. జైల్లో ఉన్నపరిస్థితులు, తన బైయిల్​పై హైకోర్టులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దళిత సంఘాల నేత బూసి వెంకట్రావు తెలిపారు. విశాఖ కేంద్రకారాగారంలో కోడి కత్తి శ్రీనుతో వెంకట్రావు ములాఖత్‌ అయ్యారు. శ్రీను ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో పరిస్థితుల దృష్ట్యా కోడి కత్తి శ్రీను దీక్ష విరమించాడని పేర్కొన్నారు. గత వారం రోజులుగా దీక్ష చేస్తున్న శ్రీను నీరసంగా ఉన్నాడని, మెరుగైన చికిత్స కోసం వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు.

నిరాహార దీక్ష విరమించిన కోడికత్తి కేసు నిందితుడు శ్రీను

విద్యుత్ నిలిపేసి - మరుగుదొడ్లకు తాళం వేసి - కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యుల దీక్ష భగ్నం

కోడికత్తి శ్రీనుతో టీడీపీ నేతల ములాఖత్​కు నిరాకరణ: కొడికత్తి శీను కుటుంబం చేస్తున్న అందోళనకు తాము అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత నేతలు అన్నారు. విశాఖ కేంద్ర కారాగారంలో కోడికత్తి శీనుతో ములాఖత్ కి జైలు అధికారులు నిరాకరించడంపై వారు మండిపడ్డారు. జైలు బయట మీడియా తో మాట్లాడుతూ, శీను బెయిల్ పై బయటకు వస్తే అసలు విషయాలు బట్టబయలు అవుతాయని సీఎం జగన్​కు బెంగ పట్టుకుందని ఆరోపించారు. అందుకే బయటకు రానివ్వకుండా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి ఆసక్తి చూపడం లేదని పుచ్చా విజయ్ కుమార్ విమర్శించారు. దళితుడైన డ్రైవర్ సుబ్రమణ్యంను హతమార్చి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీకి డెబై రోజుల్లో బైయిల్ వచ్చిందని, సీఎం పర్యటనల్లో ఎమ్మెల్సీ అనంతబాబును పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి వారిని ప్రోత్సహించే సీఎం ఏ రకంగా దళితులకు న్యాయం చేస్తారని ప్రశ్నించారు.

కోడికత్తి శ్రీనుకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: సమతా సైనిక్​ దళ్

మద్దతుగా నిలుస్తున్న ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు:గత ఐదు సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న కోడి కత్తి శ్రీనుకు మద్దతుగా, రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఓవైపు కోర్టులో న్యాయం కోసం పోరాడుతూనే, మరో వైపు ప్రజాక్షేత్రంలో శ్రీనుకు మద్దతు కూడగట్టే ప్రయాతన్నాలు చేస్తున్నాయి. ఈ అత్యవసరంగా విచారణ జరపాలని హైకోర్టులో లాయర్లు పిచ్చుక శ్రీనువాసు, పాలేటి మహేష్ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. రాజకీయ, దళిత, ప్రజా సంఘాలు శ్రీనుకు మద్దతుగా రౌండ్ టెబుల్ సమావేశాలు, ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కోడి కత్తి శ్రీను తల్లి ఆరోగ్యం క్షీణించడంతో టీడీపీ, సీపీఐ రంగంలోకి దిగి ఆమె దీక్షను విరమింపజేశాయి.

కోడికత్తి కేసులో బెయిల్​పై హైకోర్టులో అత్యవసర పిటిషన్- 'జైలులో క్షీణిస్తున్న శ్రీను ఆరోగ్యం'

ABOUT THE AUTHOR

...view details