ETV Bharat / state

కోడికత్తి శ్రీనుకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: సమతా సైనిక్​ దళ్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 3:50 PM IST

Updated : Jan 24, 2024, 9:25 PM IST

Samata Sainik Dal Round Table Meeting About Kodikatti Srinu: ఐదేళ్లుగా జైల్లో మగ్గుతున్నా శ్రీనివాసరావుకు బెయిల్ రాకపోవటం దారుణమని సమతా సైనిక్ దళ్ మండిపడింది. కోడికత్తి శ్రీనుకు న్యాయం జరగాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేసంలో టీడీపీ, జనసేన, సీపీఐ నేతలు పాల్గొని జగన్​పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

samata_sainik_dal
samata_sainik_dal

Samata Sainik Dal Round Table Meeting About Kodikatti Srinu: కోడికత్తి శ్రీనివాసరావుకు న్యాయం జరగాలని కోరుతూ సమతా సైనిక్ దళ్ ఆద్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐదేళ్లుగా జైల్లో మగ్గుతున్నా శ్రీనివాసరావుకు బెయిల్ రాకపోవటం దారుణమని సమతాసైనిక్ దళ్ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర అన్నారు. శ్రీనివాసరావుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. జగన్ గెలుపు కోసం జరిగిన కుట్రలో కోడికత్తి శ్రీను పావుగా మారాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ఆరోపించారు. జగన్​ను సీఎం కావాలని కోరుకున్న శ్రీనివాస్ ఐదేళ్లుగా జైల్లో మగ్గుతున్నాడన్నారు.

కోడికత్తి కేసులో బెయిల్​పై హైకోర్టులో అత్యవసర పిటిషన్- 'జైలులో క్షీణిస్తున్న శ్రీను ఆరోగ్యం'

కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే కుట్రకోణం బయటపడుతోందని సీఎం జగన్ భయపడుతున్నారని మండిపడ్డారు. అందుకే కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇవ్వటంలేదని మండిపడ్డారు. శ్రీనివాసరావుకు జగన్​ను చంపే ఉద్దేశం లేదు ఆయన గెలవాలని ఆశించాడని తెలిపారు. కోడికత్తితో సీఎం జగన్​కు గాటు మాత్రమే చేశాడన్నారు. శ్రీనివాసరావుకు న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. శ్రీనివాసరావుకు న్యాయం జరగాలని గవర్నర్​కు వినతిపత్రం అందజేయాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. అంటరానితనం రాష్ట్రంలో విశృంఖలంగా ఉందని నేతలు అభిప్రాయపడ్డారు.

కోడికత్తి శ్రీనుకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: సమతా సైనిక్​ దళ్

Court Verdicts on Jagan Kodikatti Case: 'కోడికత్తిని సమకూర్చింది మంత్రి బొత్స మేనల్లుడే.. జగన్ కోర్టుకు వస్తే నిజం బయటపడుతుంది'

దళితులకు రాష్ట్రంలో న్యాయం జరగట్లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. కోర్టులు శ్రీనివాసరావుకు త్వరగా న్యాయం చేయాలని కోరారు. కోడికత్తి శ్రీనివాసరావుకు న్యాయం జరపాలని పార్లమెంట్​లో ప్రస్తావిస్తామన్నారు. ఢిల్లీలో సైతం నిరసనలు వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. 12 కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం కోర్టులకు ఎందుకు హాజరుకావట్లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయాని జనసేన నేత పోతిన మహేష్ మండిపడ్డారు.

కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా - సంచలన వ్యాఖ్యలు చేసిన న్యాయవాది

అంటరానితనం​ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉంది. ఇది అంతా వైసీపీ రాజకీయ ముసుగులో ఉంది. జగన్​ రెడ్డిని అభిమానించే వ్యక్తి జనపల్లి శ్రీనివాస్. జగన్ ముఖ్యమంత్రి కావాలని ఏమైనా చేయడానికి సద్ధ పడీన శ్రీను ఈ రోజు ఐదు సంవత్సరాలుగా జైలులో మగ్గుతున్నాడు అంటే దానికి కారణం అంటరానితనమే. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే కుట్రకోణం బయటపడుతుందని జగన్ భయపడుతున్నడు అందుకే కోర్టులో సాక్ష్యం చెప్పడం లేదు శ్రీనివాసరావుకు న్యాయం జరిగేంత వరకు టీడీపీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది.- వర్లరామయ్య, టీడీపీ నేత

నేడు మర్డర్​లు చేసినా బెయిల్​ వస్తుంది కాని జగన్​ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ డ్రామాలో ఉన్న శ్రీనుకి మాత్రం బెయిల్ రాలేదు. వివేకా నంద రెడ్డి హత్య కేసులో నేరుగా ఉన్న వ్యక్తులకే సీబీఐ బెయిల్ మంజూరు చెసింది. 13 సీబీఐ కేసులు 3 ఈడీ కేసులు లక్ష కోట్ల రూపాయల స్కాం కేసులో జగన్​కు 16 నేలలలోనే బెయిల్ వచ్చింది ఆ తరువాత పాదయాత్ర చేశారు ముఖ్యమంత్రి అయ్యారు.- పోతిన మహేష్, జనసేన నేత

Last Updated : Jan 24, 2024, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.