ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమరావతి రైతుల ఉద్యమం దక్షిణాదిలోనే అతిపెద్ద పోరాటం: సుప్రీంకోర్టు మాజీ సీజేఐ ఎన్​.వి. రమణ - Justice NV Ramana In Krishna

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 8:17 PM IST

Justice NV Ramana In Krishna District : దేశంలో వ్యవసాయం అంటరానిదిగా మారిందని రైతులు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​.వి. రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో రైతు సంఘాల మధ్య చైతన్యం, ఐక్యత తక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని ప్రాంత రైతుల పోరాటం దక్షిణాదిలో జరిగిన అతి పెద్ద రైతు ఉద్యమంగా అభివర్ణించారు.

justice_nv_ramana_in_krishna_district
justice_nv_ramana_in_krishna_district

Justice NV Ramana In Krishna District :దేశంలో వ్యవసాయం అంటరానిదిగా మారిందని రైతులు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ N.V రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో రైతు సంఘాల మధ్య చైతన్యం, ఐక్యత తక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని ప్రాంత రైతుల పోరాటం దక్షిణాదిలో జరిగిన అతి పెద్ద రైతు ఉద్యమంగా అభివర్ణించారు. చట్టసభలతోపాటు కీలక వ్యవస్థల్లో రైతులకు తగిన ప్రాతినిధ్యం లభించేందుకు రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు.

ప్రజాదరణ కోల్పోయినా డబ్బు సంచులతో అధికారంలోకి వస్తున్నారు: జస్టిస్ ఎన్‌వీ రమణ

Former Chief Justice of Supreme Court NV Ramana :సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ ఒక రోజు పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లాకు విచ్చేశారు. ఆయనకు విజయా డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, అమరావతి మహిళలు, రైతులు ఘన స్వాగతం పలికారు. అమరావతి రైతులు, మహిళలు మాజీ సీజేఐకి వినతిపత్రం అందజేశారు.

తరువాత వీరవల్లిలోని కృష్ణా మిల్క్‌ యూనియన్‌ 32వ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కామథేను మిల్క్‌ ప్రాజెక్టు పేరిట నిర్మించిన నూతన ప్లాంట్‌ను సందర్శించారు. 1200 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్‌కు మిల్క్‌ యూనియన్‌ చేరడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా మిల్క్‌ యూనియన్‌ క్షణక్షణాభివృద్ధి చెందుతోందని పాలకవర్గాన్ని అభినందించారు. పాడి రైతులకు మూడో విడత బోనస్‌ చెక్కులను అందజేశారు. సమావేశంలో పాలకమండలి సభ్యులు, రైతులు జస్టిస్‌ ఎన్‌.వి. రమణను సముచితంగా సత్కరించారు. సొంత జిల్లాలో సొంత మనుషుల మధ్య సత్కారం ప్రత్యేకమైందని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. సమాజం నాగరికంగా అభివృద్ధి చెందిన క్రమంలో రైతులకు తగిన గుర్తింపు లేదని.. వ్యవసాయం అంటరానిదిగా మారిపోతోందని ఆవేదన చెందారు.

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు

'కోట్ల సంఖ్యలో రైతులున్నప్పటికీ వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం లేదు. వ్యవసాయం పరిశ్రమగా గుర్తింపు పొందలేకపోవడమే ఇందుకు ఓ కారణం అనిపిస్తోంది. అమరావతి రైతుల పోరాటం దక్షిణాది రాష్ట్రాల్లో జరిగిన అతిపెద్ద రైతు పోరాటం. అమరావతి రైతులు ఎలాంటి నేరం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి వేధించడం బాధాకరం.' -జస్టిస్‌ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు మాజీ సీజేఐ

EX CJI Justice NV Ramana: మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ సేవలకు అమెరికాలో ప్రశంస..

తొలుత జస్టిస్‌ ఎన్‌.వి రమణ బాపులపాడు మండలం బొమ్ములూరులో పర్యటించారు. గ్రామానికి చెందిన తన మిత్రుడు ముసునూరు కాశీ నివాసంలో వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశమయ్యారు. అక్కడి రామాలయం, దాసాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Justice NV Ramana in TANA: ప్రజలతో సంబంధం లేనివారు పార్టీలు నడుపుతున్నారు.. రాజకీయాలపై జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details