ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బీసీ డిక్లరేషన్ సభ విజయవంతంపై వైసీపీ నేతలకు ఓటమి గుబులు పట్టుకుంది: పోతిన మహేష్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 2:00 PM IST

Janasena Leader Pothina Mahesh comments On YSRCP: జయహో బీసీ డిక్లరేషన్ సభ విజయవంతంపై వైసీపీ నేతలకు ఓటమి గుబులు పట్టుకుందని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన- టీడీపీ పార్టీలు గెలిచి అధికారం చేపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు

Janasena Leader Pothina Mahesh comments On YSRCP
Janasena Leader Pothina Mahesh comments On YSRCP

Janasena Leader Pothina Mahesh comments On YSRCP: జయహో బీసీ డిక్లరేషన్ సభ విజయవంతం కావటంపై వైసీపీ నేతలకు అప్పుడే ఓటమి గుబులు పట్టుకుందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. సామాజిక న్యాయం పేరుతో అందరినీ సామాజికంగా మోసం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఓటమి పాలు చేయటానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని మహేష్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 43వ డివిజన్లో పోతిన మహేష్ దంపతులు ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి రాబోయేది జనసేన- టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ తగ్గించి సవతి తల్లి ప్రేమ చూపించని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో జరిగిన టీడీపీ బీసీ డిక్లరేషన్ ద్వారా నిజమైన తల్లి ప్రేమ చూపించందని తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు చంద్రబాబు, పవన్​ కల్యాణ్​ ప్రకటించిన బీసీ డిక్లరేషన్​పై హర్షం వ్యక్తం చేస్తున్నారని పోతిన మహేష్ తెలిపారు.

జగన్​కు బీసీలంటే చిన్నచూపు - అపాయింట్​మెంటే ఇవ్వరు: నారా లోకేశ్

సీఎం జగన్‌ నా బీసీలు అని మాట్లాడటానికి ఆయనకు ఏం అర్హత ఉందని పోతిన మహేష్​ ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని బీసీలంతా టీడీపీ, జనసేనతోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల పాలనలో బీసీల కోసం ఒక్క పథకమైనా ప్రవేశపెట్టిందా? అని ఆయన ప్రశ్నించారు. జగన్​ సర్కార్​ బీసీల ఆదరణ, పెళ్లి కానుక, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలను ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నల వర్షం గుప్పించారు. బీసీలను టీడీపీ, జనసేన పార్టీలు తమ సొంత బిడ్డల్లా చూస్తుంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం వారిని చిన్న చూపు చూస్తోందని మండిపడ్డారు. ఎంపీ పదవి కోసం ఆర్‌.కృష్ణయ్య బీసీల ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తును జగన్‌రెడ్డి వద్ద తాకట్టు పెట్టారని పేర్కొన్నారు.

వైసీపీ పాలనలో 300 మంది బీసీలను చంపేశారు: పవన్ కల్యాణ్​

మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో టీడీపీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్​పై పలువురు బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీసీలు లేకుంటే సమాజం ముందుకెళ్లదని, నాగరికతకు వారే మూలమని, బీసీలకు టీడీపీతోనే గుర్తింపు వచ్చిందని పలువురు టీడీపీ నేతలు పేర్కొన్నారు. రాజ్యాధికారం కోసం స్థానిక సంస్థల్లో చంద్రబాబు రిజర్వేషన్లు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెప్పడంపై పలువురు బీసీ వర్గాల వారు టీడీపీ- జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు.

బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ - 10 అంశాలతో టీడీపీ-జనసేన 'బీసీ డిక్లరేషన్'

ABOUT THE AUTHOR

...view details